ఫిబ్రవరి 1 నుంచి మండ మెలిగే పండుగ
నాలుగు రోజులపాటు మినీ జాతర
పూజారులు సమావేశమై నిర్ణయం
స్పాట్ వాయిస్, ములుగు: జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం మినీ జాతరకు సిద్ధం అవుతోంది. జాతర తేదీలను అమ్మవార్ల పూజారులు మంగళవారం ప్రకటించారు. వచ్చే ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజులపాటు మండ మేడారంలో మెలిగే పండుగ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మేడారంలోని కార్య నిర్వహణ అధికారి (ఈవో) కార్యాలయంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పూజారుల (వడ్డెల)సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అధ్యక్షతన పూజారుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వచ్చే ఫిబ్రవరి మాఘమాసంలో నిర్వహించే మండ మెలిగే పండుగ తేదీలపై పూజారులు చర్చించారు. ఈ సందర్భంగా మండ మెలిగే పండుగ మినీ మేడారం జాతర తేదీలను ఖరారు చేశారు.
*ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు మండ మెలిగే మినీ మేడారం జాతర జరుపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
* ఫిబ్రవరి 1న బుధవారం మొదలయ్యే మండ మెలిగే పండుగ.., గురు, శుక్ర, శనివారం జాతర జరుగనుంది.
*ఈ నాలుగు రోజులు మేడారంలో అంతర్గత పూజలు జరుగుతాయని సమ్మక్క సారలమ్మ జాతర పూజార్ల సంఘం వెల్లడించింది.
తరలి రానున్న భక్తులు
మినీ మేడారం జాతరకు కూడా లక్షలాది మంది భక్తులు మేడారం తరలిరానున్నారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకొనున్నారు.
Recent Comments