Sunday, November 24, 2024
Homeతెలంగాణబండి యాత్రకు గ్రీన్ సిగ్నల్..

బండి యాత్రకు గ్రీన్ సిగ్నల్..

బండి యాత్రకు గ్రీన్ సిగ్నల్
అనుమతి ఇచ్చిన హైకోర్టు ..
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర కు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. నిర్మల్‌ జిల్లా భైంసా నుంచి యాత్ర చేపట్టేందుకు సంజయ్‌ వెళ్తుండగా ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్‌ శివారులో పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో ఈ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం పలు షరతులతో పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. యాత్ర ప్రారంభోత్సవ సభ భైంసా పట్టణానికి మూడు కి.మీ. దూరంలో ఉంటేనే అనుమతించాలని పోలీసులకు స్పష్టం చేసింది. అయితే భైంసా పట్టణంలోకి పాదయాత్ర వెళ్లనపుడు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని హైకోర్టు వారిని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ స్పందిస్తూ.. భైంసా ప్రాంతం చాలా సున్నితమైనదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అలాగే పిటిషనర్ల తరఫున న్యాయవాది రామచందర్‌రావు భైంసా పట్టణం మీదుగా పాదయాత్ర వెళ్లదని తెలుపుతూ రూట్‌మ్యాప్‌ వివరాలను న్యాయస్థానానికి సమర్పించారు. పట్టణంలోని ప్రవేశించకుండా వై జంక్షన్‌ నుంచి మాత్రమే కొనసాగుతుందని వివరించారు. కాగా, ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. సంజయ్‌ పాదయాత్రకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments