పొలాలకు నిప్పు పెట్టొద్దు
స్పాట్ వాయిస్ , రేగొండ : రైతులు వరి పొలాలు కోసిన అనంతరం విచ్చలవిడిగా కాలబెట్టడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని మారి అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ అక్కల రమేష్ అన్నారు. శనివారం రంగయ్యపల్లి గ్రామంలో మారి స్వచ్ఛంద సంస్థ, ప్రజ్వల్ రైతుల ఉత్పత్తి
దార్ల సంఘం ఆధ్వర్యంలో రైతులకు బీసీఐ మంచి పత్తి పంట విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా అక్కల రమేష్ హాజరై మాట్లాడారు. వరి పంట కోసిన పొలాలకు నిప్పు పెట్టడం వలన భూమి లోపల ఉన్న నత్రజని, పొటాషియం, గంధకం, భాస్పరం, సేంద్రియ కర్బనం పదార్థాల లాంటివి నిర్వీర్యం అవుతాయని తెలిపారు. వీటివల్ల పంటకు కావలసిన పోషక విలువలు పూర్తిస్థాయిగా నాశనమై పర్యావరణం కలుషితమై సరైన దిగుబడి రాదని తెలిపారు. కార్యక్రమంలో పల్నాటి రాంబాబు, వంగ అశోక్, గ్రామ రైతులు చెర్రీ సమ్మయ్య , నర్సింగరావు, నాగేశ్వరరావు, సాయన్న, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు.
పొలాలకు నిప్పు పెట్టొద్దు
RELATED ARTICLES
Recent Comments