Sunday, November 24, 2024
Homeజాతీయంపిచ్చెక్కి మాట్లాడుతున్న బాబా రాందేవ్

పిచ్చెక్కి మాట్లాడుతున్న బాబా రాందేవ్

మహిళా సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలి..
జాతీయ చేనేత ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి గూడ లావణ్య నేత
స్పాట్ వాయిస్, వరంగల్ : బాబా రాందేవ్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని, ఆయన మహిళా సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని జాతీయ చేనేత ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి గూడ లావణ్య నేత డిమాండ్ చేశారు. ఇటీవల మహారాష్ట్ర తానేలో యోగా శిబిరం ముగిసిన తరువాత బాబా రాందేవ్ మహిళలు ధరించే దుస్తుల గురించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై గూడ లావణ్య నేత మాట్లాడుతూ.. మహిళల విషయంలో మర్యాదతో మెదలాలని భారత సనాతన ధర్మం చెప్తుందన్నారు. కానీ మత మౌడ్యాన్ని తలకెక్కించుకుని కొందరు తరచూ మహిళలను చులకనగా చూస్తున్నారని, వారు ధరించే దుస్తుల విషయంలో తప్పుడు అర్థం వచ్చేలా మాట్లాడడం దారుణమన్నారు. బాబా రాందేవ్ కూడా ఓ తల్లికి పుట్టాడనే విషయాన్ని మరిచి ఓ డిప్యూటీ సీఎం భార్య అదే వేదికపై ఉన్నప్పటికీ మతి భ్రమించి మాట్లాడడం సిగ్గు చేటన్నారు. మహిళల విషయంలో తప్పుడు ఆలోచన ఉండొద్దనే దేశ ప్రధాని మోడీ భేటీ బచావో -భేటీ పటావో అనే నినాదాన్ని ఇస్తుంటే, బాబా రాందేవ్ తప్పుడు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే ఆయన మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని, లేకపోతే అన్ని మహిళా సంఘాలను కలుపుకొని బాబా రాందేవ్ కు బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments