పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలి
టీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోలేపల్లి శంకర్ రెడ్డి
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరిని అత్యధిక మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఐనవోలు మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు పోలేపల్లి శంకర్ రెడ్డి అన్నారు. టీఆర్ ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడి ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన ‘ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఇన్ చార్జి’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు పాపారావు ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండల పార్టీ అధ్యక్షుడు పోలేపల్లి శంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బుర్ర రాజశేఖర్, గ్రామ పార్టీ ఇన్ చార్జి పొన్నాల రాజు హాజరై గ్రామంలో ప్రతీ వంద మంది ఓటర్లకు ఒక ఇన్ చార్జిని ని నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్ ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా కార్యకర్తలంతా ఐక్యంగా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరిస్తూ, ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ తక్కళ్లపెల్లి చందర్ రావు, గ్రామ సర్పంచ్ పిడుగు రజిత, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దుప్పల్లి కొమురయ్య, నాయకులు వరంగంటి రాములు, పిడుగు లింగయ్య, కావటి స్వామి, పిడుగు ఐలయ్య, యాకమల్లు, రవీందర్, కావటి బజ్జెలు, కోల సంపత్, జిల్లా రాజు, మహేందర్, దయాకర్, శ్రావణ్, బాబు, బర్ల అనిల్, కందిక బాబు, కొమురయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
అరూరిని అత్యధిక మెజారిటీతో గెలిపించడమే లక్ష్యం
RELATED ARTICLES
Recent Comments