Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుచిన్నారులకు దాతల ఆర్థిక సాయం

చిన్నారులకు దాతల ఆర్థిక సాయం

చిన్నారులకు దాతల ఆర్థికసాయం
రూ. 3 లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్
స్పాట్ వాయిస్ నర్సంపేట (చెన్నారావుపేట) : అతి చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులకు పలువురు దాతలు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. సామాజిక మాధ్యమాల ద్వారా వారి పరిస్థితిని తెలుసుకున్న ఉద్యోగులు, వ్యాపారులు, గ్రామస్తులు స్పందించగా, విరాళాలు ద్వారా సేకరిచిన రూ. 3 లక్షల మొత్తాన్ని పిల్లల భవిష్యత్తు కోసం పోస్టాఫీస్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.
చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గుల్లపెళ్లి నాగరాణి ఇటీవల అనారోగ్యంతో మరణించింది. నాగరాణి భర్త సాంబయ్య రోజు వారీ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి శ్రావణి, సింధు ఇద్దరు కుమార్తెలు ఉండగా, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే నాగరాణి గారి మరణ వార్త వివిధ పత్రికల్లో ప్రచురితం కాగా గ్రామంలోని ఉద్యోగులు, వ్యాపార వేత్తల పేరుతో వాట్సాప్ గ్రూప్ లో చెరవేశారు. దీంతో ఉద్యోగులు, వ్యాపార వేత్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, హై స్కూల్, ప్రైమరీ స్కూల్ ఉపాద్యాయులు ఇలా దాదాపు 200 మంది దాతలు స్పందించగా, రూ. 3 లక్షల వరకు వచ్చిన విరాళాలను శ్రావణి, సింధు పేర్లపై గ్రామ సర్పంచ్ పెరుమాండ్ల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోస్టాఫీస్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి, బాండ్లను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు పులి దేవేందర్ మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్ కోసం గ్రామస్తులు డబ్బులు డొనేషన్ చేయడం సంతోషమన్నారు. పిల్లలు విద్యా, ఉద్యోగ రంగాల్లో స్థిరపడడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయూతనిస్తాయని, ఆర్థికసాయం చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి మొదటి నుంచీ తన విలువైన సమయాన్ని కేటాయించిన గుల్లపెళ్లి స్వామి, పరికి మధుకర్, కుక్కల సతీష్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాసాని రమేష్, ఊడుగుల శ్రీనివాస్, మాడుగుల కుమారస్వామి, రుద్రు రాజు, ఎండీ బాషామియా, గుల్లపెళ్లి వెంకన్న, మంతుర్తి అన్వేష్, నాగరాజు, వట్టే రవికిరణ్, ఆర్ఎంపీలు శ్రీను, రహీం, ఊడుగుల సాంబయ్య, డీలర్ రాజు, కుక్కల సాంబ రాజు, తాడికొండ కోటి, గుల్లపెళ్లి రాజారాం, గ్రామస్తులు, పెద్దలు, ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments