Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుమోకుదెబ్బ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడిగా రమేష్ గౌడ్

మోకుదెబ్బ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడిగా రమేష్ గౌడ్

మోకుదెబ్బ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడిగా రమేష్ గౌడ్
స్పాట్ వాయిస్, నర్సంపేట : మోకుదెబ్బ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడిగా అనంతుల రమేష్ గౌడ్ నియమితులయ్యారు. గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ జాతీయ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నూతనంగా నర్సంపేట నియోజక వర్గానికి చెందిన మోకు దెబ్బ రాష్త్ర ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ ని పొలిట్ బ్యూరో సభ్యుడిగా జాతీయ అధ్యక్షుడు అమర వేణి నర్సాగౌడ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జాతీయ సెక్రటరీ జనరల్ రాగుల సిద్ది రాములు గౌడ్, జాతీయ ప్రధాన కార్యదర్శి కొండాపురం బాలరాజ్ గౌడ్, పొలిట్ బ్యూరో సభ్యుడు, హైకోర్టు న్యాయవాది బాలసాని సురేష్ గౌడ్, ఏవీ భలేషం గౌడ్, ముత్యం నర్సింహులు గౌడ్, కేసరి ఆంజనేయులు గౌడ్, సిపతి లింగా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments