స్పాట్ వాయిస్, కాజీపేట: అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 38 శబరిమల ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్-కొల్లాంకు డిసెంబరు 5, 12, 19, 26, జనవరి 2, 9, 16 తేదీల్లో.. కొల్లాం-హైదరాబాద్‌కు డిసెంబరు 6, 13, 20, 27, జనవరి 3, 10, 17.. నర్సాపూర్-కొట్టాయం డిసెంబరు 2, 9, 16, 30, జనవరి 6, 13.. కొట్టాయం-నర్సాపూర్ డిసెంబరు 3, 10, 17, 24, జనవరి 7, 14.. సికింద్రాబాద్-కొట్టాయం డిసెంబరు 4, 11, 18, 25, జనవరి 1, 8.. కొట్టాయం-సికింద్రాబాద్ డిసెంబరు 4, 11, 18, 25, జనవరి 2, 9 తేదీల్లో రైళ్లు బయలుదేరనున్నాయి.
వివరాలు..
హైదరాబాద్-కొల్లం (నం.07133) డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. జనవరి 2, 9, 16 తేదీల్లో నడుస్తుంది. కొల్లం-హైదరాబాద్ (నం.07134) డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్ మీదుగా వెళ్తుంది.
సికింద్రాబాద్-కొట్టాయం (నం. 07125): డిసెంబర్ 4,11, 18, 25, జనవరి 1, 8 తేదీల్లో, కొట్టాయం-సికింద్రాబాద్ (నం.07126) మధ్య డిసెంబర్ 5, 12, 19, జనవరి 2, 9 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఇది చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కోయంబత్తూరు మీదుగా వెళ్తుంది.
నర్సాపురం-కొట్టాయం (నం. 07119) డిసెంబర్ 2,9,16,30, జనవరి 6,13వ తేదీలలో తిరగనుంది. కొట్టాయం-నర్సాపురం (నం. 07120) డిసెంబర్ 3,10,17,31వ తేదీలతో పాటు జనవరి 7,14వ తేదీలలో నడవనుంది. ఇది పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కోయంబత్తూరుతో ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది.
Recent Comments