ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి అసహనం
స్పాట్ వాయిస్, హైదరాబాద్: ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఐటీ అధికారులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన కొడుకును రాత్రంతా సీఆర్పీఎఫ్ వాళ్లతో కొట్టించినందుకే అతను హాస్పిటల్ పాలయ్యాడని ఆరోపించారు. టీఆర్ఎస్ మంత్రినన్న కారణంతోనే తనను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. రాజేశ్వర్ రెడ్డి, త్రిశూల్ రెడ్డి, జై కిషన్ తో తనకేం సంబంధమని మల్లారెడ్డి ప్రశ్నించారు. మేము ఎవరిని దగా మోసం చేయడం లేదు. మేం ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నాం. స్మగ్లింగో, క్యాసినోనో ఆడటం లేదు. బీజేపీ దుర్మార్గ పాలన చేస్తోంది’’. ‘‘ఆస్తులు అమ్ముకోండి.. గుంజుకోండి… వేలం వేసుకోండి అంతేతప్ప ఇలా దౌర్జన్యం చేయడం మంచిది కాదని అన్నారు. తన ఇల్లు, ఆఫీసులు, కాలేజీల్లో సోదాలు చేసినా ఏమీ దొరకలేదని చెప్పారు. త్రిశూల్ రెడ్డి దగ్గర, ఊరిలో ఎవరి దగ్గర పైసలు దొరికినా తనవేనా అని మల్లారెడ్డి ప్రశ్నించారు. ఇంత దౌర్జన్యంగా వ్యవహరించే కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటి దాకా చూడలేదన్న ఆయన.. కనీసం తన కొడుకును కూడా చూడనిస్తలేరని ఆవేదన వ్యక్తం చేశారు.
నా అస్తులు గుంజుకోండి.. అమ్ముకోండి
RELATED ARTICLES
Recent Comments