Friday, November 15, 2024
Homeలేటెస్ట్ న్యూస్గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

32 మంది విద్యార్థులకు అస్వస్థత
ఆస్పత్రికి తరలింపు..
అధికారులపై మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆదివారం చికెన్ వండారు. భోజనం చేసిన విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆదివారం రాత్రి నుంచే విద్యార్థులు ఇబ్బందులు పడుతుండగా.. సోమవారం సైతం ఈ విషయాన్ని అధికారులు బయటికి పొక్కనివ్వలేదు. అయితే మంగళవారం విద్యార్థులకు విరేచనాలు ఎక్కువకావడంతో హుటాహుటిన ఆశ్రమ అధికారులు ఆస్పత్రికి తరలించారు. మొత్తం 32 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు.
స్పందించిన మంత్రి..
కొత్తగూడ గిరిజన ఆశ్రమ స్పోర్ట్స్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై గిరిజన,స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. కలెక్టర్, అధికారులు, వైద్యులతో ఫోన్ ద్వారా మాట్లాడిన మంత్రి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ డీడీ తో మాట్లాడిన మంత్రి ఫుడ్ పాయిజన్ ఘటన పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పాఠశాల చేరుకుని ఫుడ్ పాయిజన్ గల కారణాలు, అక్కడి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. డీఎం అండ్ హెచ్ఓ హరీశ్ రాజ్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments