ఆయన చల్లా అధర్మా రెడ్డి..
కర్రు కాల్చి వాత పెట్టాలి..
వైఎస్ ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల
పరకాలలో పాదయాత్ర..
ఎమ్మెల్యే , టీ ఆర్ ఎస్ సర్కార్ పై ఫైర్
స్పాట్ వాయిస్, పరకాల: ఆయన పేరు చల్లా అధర్మా రెడ్డి.. ఆయన కు కర్రు కాల్చి వాత పెట్టండి.., ఎమ్మెల్యే ముసుగులో ఉన్న బడా కాంట్రాక్టర్.., ఏ కాంట్రాక్ట్ వదలడు.. ఆ మాటకొస్తే ఏ చిన్న పని కూడా వదలడు.., ఆ లెక్కనే అక్షరాల 5 వేలకోట్లు వెనకేశాడట..” అని వైఎస్ ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎం ఎల్ ఏ చల్లా పై ధ్వజమెత్తా రు. పాదయాత్ర లో భాగంగా పరకాల లో నిర్వహించిన సభలో వైఎస్ షర్మిల మాట్లాడారు. చల్లా ధర్మారెడ్డి కన్ను ఒక భూమి మీద పడితే లేని లిటిగేషన్ లు పెడతారని, మళ్లీ తానే పరిష్కారం అని చెప్పి ఆ భూమిని ఆగ్గువకు కొని మొత్తం లాభాలు ఆయనే తీసుకోవాలనే మనస్తత్వం అన్నారు.
*జయశంకర్ సార్ కి గౌరవం ఇదేనా..
పరకాల నియోజక వర్గం ప్రొఫెసర్ జయశంకర్ పుట్టిన గడ్డని, తెలంగాణకు సిద్ధాంత కర్త, తెలంగాణ కు దిశా దశ చూపించిన గొప్ప వ్యక్తి ఆయన పుట్టిన ఊరు అక్కంపేట కే దిక్కు లేకుండా పోయిందన్నారు. జయశంకర్ సార్ కి గౌరవం ఎక్కడుందని.., ఆయన పుట్టిన అక్కంపేట ను అవమానించారన్నారు. స్మృతివనం ఏదని.., లైబ్రరీ ఎక్కడని.., ఆదర్శ గ్రామం ఏమైందని దుయ్యబట్టారు. 8 ఏళ్లుగా అక్కంపేట ను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కనీసం అక్కంపేట గ్రామానికి త్రాగడానికి నీరు లేదన్నారు.
చల్లా ధర్మా రెడ్డి ఒక పశువు..
ఇక్కడ YSR విగ్రహం ఉండే.., దానిని చల్లా దగ్గర ఉండి మరి ముక్కలు ముక్కలు చేయించాడు, మహానేత వైఎస్ విగ్రహాన్ని పగల గొట్టి చల్లా ఒక పశువు అనిపించుకున్నారన్నారు. ఈ దిక్కుమాలిన ఎమ్మెల్యే పొరపాటున మాట్లాడిన ఒక మంచి మాట చెప్పాడని దుయ్య బట్టారు. అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతారని, వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలను 12 రోజులు జైల్లో పెట్టించాడన్నారు.
ఓ అహం కారి..
ఎం ఎల్ ఏ చల్లా ఓ అహంకారి అని, పథకాలు ఆయన అనుచరులకు ఇస్తా అని పబ్లిక్ గా చెప్తాడని, అవేదో ఆయన సొంత ఆస్తులు ఇచ్చినట్లు చెప్తున్నాడని ఏద్దేవా చేశారు. ఈ దిక్కుమాలిన ఎమ్మెల్యే కి నోటి దురుసు చాలా ఎక్కువని, దళిత గిరిజనుల బిడ్డలు ఈయనకు మనుషుల్లా కనపడరని, పెద్ద పెద్ద ఉద్యోగాలలో దళిత,గిరిజనులు ఉన్నారని.. వారికేం తెలియదని ఎలా అంటాడని ప్రశ్నించారు. వాళ్లు పెద్ద ఉద్యోగాలలో ఉండటం తెలంగాణ దౌర్భాగ్యం అని ఎలా అంటాడని, అందరూ ఓటు వేస్తే నే కదా గెలిచి అలా మాట్లాడడం పొగరు బోతు తనం అన్నారు. వారి ఓట్లతో గెలిచి సోయి లేకుండా ఎలా మాట్లాడుతారని, ఇలాంటి ఎమ్మెల్యే లకు మళ్ళీ ఓటు వేస్తారా అని ప్రజలకు ప్రశ్నించారు.
నీళ్ళేవి..
ఈ నియోజక వర్గంలో మూడు పంటలు వేసుకునేందుకు సాగు నీరు ఇస్తా అన్నారు కానీ ఒక్క ఎకరాకు ఇవ్వలేదన్నారు. ఈ ఏడాది జనవరి లో అకాల వర్షాలకు 17 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే పట్టించుకున్న పాపన పోలేదన్నారు. కనీసం పరిహారం కూడా లేదని, సీఎం వస్తా అని చెప్పి మొహం చాటేశారని ఫైర్ అయ్యారు.
అగ్గువకు భూములు..
కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ పేరు చెప్పి ఆగ్గువ కు భూములు గుంజుకున్న ఘనులు ఈ నేతలన్నారు.50 లక్షల విలువ చేసే భూమికి 10 లక్షలు ఇచ్చారని, అలా 12 వందల ఎకరాలు తీసుకున్నారని, మళ్ళీ ఇప్పుడు భూములు కావాలని భయపెడుతున్నరన్నారు.
ఆధ్వానం గా రోడ్లు..
నియోజక వర్గంలో రోడ్లు మొత్తం అధ్వానం గా మారాయని, పొద్దున తొలి స్పీకర్ గ్రామం మీదుగా వచ్చామని, ఇప్పటికీ YSR వేసిన రోడ్లే దిక్కుగా ఉన్నాయన్నారు. ఇక్కడ ఇసుక మాఫియా..మట్టి మాఫియా రాజ్యమేలుతోంది అన్నారు.
రైతులు ఆగం..
మోడీ కేసీఅర్ ప్రభుత్వాలు రైతులను ఆగం చేశాయన్నారు. నిజంగా కేసీఅర్ హయాంలో రైతులు దగా పడ్డారని, వ్యవసాయం పూర్తిగా భ్రష్టు పట్టించారన్నారు. 40 వేల పథకాలు బంద్ పెట్టి ముష్టి 5 వేలు ఇస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని, ఇది రైతు ప్రభుత్వం కాదని, కే సీ ఆర్ రైతు ద్రోహి అని ధ్వజమెత్తరు. 8 ఏళ్లుగా రాష్ట్రం లో ఏ ఒక్క పథకం కూడా అమలు కాలేదన్నారు. తెలంగాణ లో ప్రజలకు సమస్యలు లేవని అంటున్నారని, ఎన్ని సమస్యలు ఉన్నాయని తాను చూపిస్తా నని సవాల్ విసిరారు.
కేసీఆర్ మనవడు గిదే తింటుండా..
కేసీఆర్ మనవడు తినే బియ్యం పేద బిడ్డలు కూడా తినాలి అన్నాడు., కేసీఅర్ మనవడు ఈ దొడ్డు బియ్యం తింటాడా..? అని షర్మిల ప్రశ్నించారు. చిన్న పిల్లలు అని కూడా సోయి కూడా లేదని, కేసీఅర్ మనవడు వెళ్ళే స్కూల్ ఫీజు ఏడాదికి 10 లక్షలు, పేద బిడ్డలు చదివే స్కూళ్లు ఎప్పుడు కూలుతాయో తెల్వదన్నారు. వై ఎస్ ఆర్ ఇక్కడ విద్యార్థుల కోసం డిగ్రీ కాలేజీ ఇచ్చారు, పాల్ టెక్నిక్ కాలేజీ ఇచ్చారు కానీ ఇంత వరకు ఓపెన్ చేయలేదన్నారు. పరకాల నియోజక వర్గానికి YSR ఎంతో చేశారు, ఇక్కడ వైఎస్సార్ పాదయాత్ర కూడా చేశారు, రైతులు పడుతున్న కష్టాలు తెలుసుకున్నారు, దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా పరకాలకు త్రాగునీరు అందించారు, చలివాగు ద్వారా వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చారు, ఇక్కడ వాగుల మీద వందల చెక్ డ్యాం లు కట్టారని గుర్తు చేశారు.
వై ఎస్ ఆర్ టీ పి పేదల కోసం పెట్టిన పార్టీ అని, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండని
వైఎస్సార్ సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని హామీ ఇచ్చారు.
Recent Comments