Saturday, November 16, 2024
Homeతెలంగాణనిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడుతా..

నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడుతా..

చిల్లర మాటలు బంద్ చేయ్..
బిడ్డా.. ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తా..
ఎంపీ అర్వింద్‌కు ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో కవిత మాట్లాడారు. ఎంపీ అర్వింద్ ప్రవర్తన నిజామాబాద్‌కే అవమానకరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ మద్దతుతో యాక్సిడెంటల్‌గా గెలిచారని అన్నారు. బాధతో మాట్లాడుతున్నానని, తెలంగాణ ప్రజలు క్షమించాలన్నారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నీతి, నిజాయితీ, ఒక పద్ధతి ఉంటుందని, సీఎం కేసీఆర్‌ని అనరాని మాటలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఖర్గేతో మాట్లాడినట్టు అరవింద్‌ చెబుతున్నారని, కానీ కాంగ్రెస్‌తో కలిసి గెలిచింది అర్విందేనని ఈ సందర్భంగా చెప్పారు. ఇంత వరకూ నేను ఏ ఒక్కరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని, నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకోనని హెచ్చరించారు. నా పుట్టుక, నా భవిష్యత్తు తెలంగాణ, టీఆర్‌ఎస్ అని బిడ్డా చెప్తున్నా.. గుర్తుపెట్టుకో… వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తావో చెయ్‌ వెంటపడి ఓడిస్తానని సవాల్ చేశారు. పార్లమెంట్‌లో ఎంపీ అరవింద్‌ పెర్ఫార్మెన్స్‌ జీరో అని కవిత అన్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఏనాడూ ప్రశ్నించలేదని చెప్పారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్‌ పేపర్‌ రాసిచ్చి రైతులను మోసం చేశాడని మండిపడ్డారు. ఎంపీ అరవింద్‌ ఫేక్‌ సర్టిఫికెట్లపై ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

బీజేపీ ఆఫర్ ఇచ్చింది..
బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చిన మాట నిజమేనని కవిత అన్నారు. నిజామాబాద్ కు ఎంపీ గా అరవింద్ అనే ఆణిముత్యం ఉన్నారని, ఆయనదిసంకుచిత మనస్తత్వం, చిల్లర మాటలంటూ కవిత ఎద్దేవా చేశారు. ఆయన అనుకోకుండా ఎంపీ అయ్యారన్నారు. అరవింద్ బురద లాంటోడని, నిన్న ప్రెస్ మీట్లో నీచంగా మాట్లాడారని, అర్వింద్ భాష చూస్తుంటే ఇలాంటి రాజకీయాలు అవసరమా అనిపిస్తోందని కవిత అన్నారు. నేను సమస్యల మీద మాట్లాడతానని,.. వ్యక్తులపై ఎప్పుడూ మాట్లాడలేదని, ఆ ఎంపీ తీరు చూసి మాట్లాడక తప్పడం లేదన్నారు. మళ్లీ నా గురించి పార్టీ మారడం గురించి మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తా లో చెప్పు తో కొడతానని హెచ్చరించారు. ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతున్నానన్నారు. నా జీవితం నేను నమ్మే ఏకైక నాయకుడు కేసీఆర్ అని, ఆయనతోనే నా రాజకీయ ప్రయాణం ఉంటుందన్నారు. మేం ఈడీ దాడులకు భయపడమని, జాతీయ రాజకీయాలోకి కచ్చితంగా వెళతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments