Tuesday, November 26, 2024
Homeలేటెస్ట్ న్యూస్మళ్లీ కంటి వెలుగు

మళ్లీ కంటి వెలుగు

జనవరి 18న ప్రారంభం
వెల్లడించిన సీఎం కేసీఆర్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాష్ర్టంలో మళ్లీ కట్టివెలుగు కార్యక్రమం మొదలుకానుంది. 2023 జనవరి 18 తేదీ నుంచి.. కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. కంటి వెలుగు అమలు తీరు, ప్రజారోగ్యం, వైద్యం తదితర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు., ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఎ.జీవన్ రెడ్డి, బాల్క సుమన్, కంచర్ల భూపాల్ రెడ్డి, జి.విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ఫారెస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, హెల్త్ సెక్రటరీ రిజ్వి, డీఎంఈ రమేశ్ రెడ్డి, హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
2018లో..
కంటి వెలుగు పథకాన్ని 2018, ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం విధిత‌మే. అయితే.. ఈ పథకం ఐదు నెలల పాటు కొనసాగింది. కంటి వెలుగు కోసం ప్రభుత్వం రూ.106 కోట్లు ఖర్చు చేసింది. ఈ పథకంలో భాగంగా కంటి స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతున్న వారికి కళ్లద్దాలతో పాటు మందులు కూడా పంపిణీ చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments