Monday, November 25, 2024
Homeతెలంగాణనిత్య జాతీయ గీతాలాపన

నిత్య జాతీయ గీతాలాపన

దేశభక్తిని నింపేందుకే నిత్య జాతీయ గీతాలాపన
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చెల్పూర్ లో నిత్య జాతీయ గీతాలాపనకు శ్రీకారం
ఎస్పీ సురేందర్ రెడ్డితో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
స్పాట్ వాయిస్, గణపురం: ప్రతీ పౌరుడిలో దేశభక్తిని మరింత పెంచేందుకు నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని మండలంలోని చెల్పూర్ గ్రామంలో 353 జాతీయ రహదారిపై సోమవారం నిత్య జాతీయ గీతాలాపనకు శ్రీకారం చుట్టారు. సర్పంచ్ నడిపెల్లి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ గీతాలాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు చెల్పూర్ జంక్షన్‌ లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపేందుకు నిత్య జాతీయ గీతాలాపనకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ప్రతీ రోజు నిర్ణీత సమయంలో జాతీయ గీతాలాపన జరుగుతుందని, ఆ సమయంలో ప్రతీ ఒక్కరూ విధిగా జాతీయ గీతం పూర్తయ్యేంత వరకు వేచి ఉండి జాతీయ గీతాన్ని గౌరవించాలని ఎమ్మెల్యే కోరారు. ఎస్పీ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ నిత్య గీతాలాపనతో సోదరభావం, ఐక్యత పెంపొందుతుందని చెప్పారు.

సీసీ కెమెరాలతో నేరాల కట్టడి : ఎస్పీ
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని వీటితో నేరాలను కట్టడి చేయవచ్చని భూపాలపల్లి ఎస్పీ సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం చెల్పూర్ లక్కం జయచంద్ర గార్డెన్ లో ఎర్పాటు చేసిన ప్రారంభోత్సవంలో సీసీ కెమెరాలను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయవచ్చని, నేరస్థులు సీసీ కెమెరాలు ఉన్న ప్రదేశాలలో నేరం చేసేందుకు వెనుకడుగు వేస్తారని తెలిపారు. ప్రజలు తమ కాలనీలో జరిగే అసాంఘీక కార్యకలాపాల గురించి పోలీసులకు తెలియజేసి సహకరించాలని సూచించారు. వార్డులో పటిష్టమైన సీసీ కెమెరాల రక్షణ వ్యవస్థ ఉండడంతో ప్రజల్లో భద్రతమైన భరోసా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో మాట్లాడుతూ చెల్పూర్ వర్తక సంఘం, గ్రామస్తుల ఆధ్వర్యంలో గ్రామ భద్రత కోసం రూ. 13లక్షల వ్యయంతో 45 సీసీ కెమెరాలను గ్రామస్థులు స్వయంగా ఏర్పాటు చేసుకోవడం అందరికి ఆదర్శనీయమన్నారు. అన్ని గ్రామాల ప్రజలు చెల్పూర్ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇలాగే సీసీ టీవీ కెమెరాలను అమర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ రాములు, సీఐ పులి వెంకట్ , ఎస్సై అభినవ్ , ఎంపీపీ కావటి రజిత, ఎంపీటీసిలు చెన్నూరి రమాదేవి మధుకర్, పొనగంటి సుధర్మ మల్హర్ రావు, పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొలుసాని లక్ష్మీనరసింహారావు, నాయకులు కొత్త వెంకటేశ్వర్లు, దాసరి రవీందర్, బైరగాని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments