జీపీ సిబ్బంది పై గ్రామస్తుల ఆగ్రహం
పోడు భూముల సర్వేలో దరఖాస్తులు పెట్టుకున్నా ఆన్ లైన్ చేయలేదని గ్రామస్తుల ఆగ్రహం
స్పాట్ వాయిస్, నర్సంపేట(ఖానాపురం) : ఖానాపురం మండలంలోని మంగళవారిపేట గ్రామపంచాయతీ పాలకవర్గంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో పోడు భూముల సర్వేలో గ్రామస్తులు దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ పాలకవర్గం తప్పిదం వల్ల ఆన్ లైన్ కాలేదని గ్రహించిన గ్రామస్తులు నిలదీశారు. అయితే ఈ విషయమై తమకు సంబంధం లేదంటూ, అంతా కారోబారే చేశాడంటూ సర్పంచ్ రమేష్ చేతులు దులుపుకునే ప్రయత్నం చేశాడని గ్రామస్తులు ఆరోపించారు. సర్పంచ్, కార్యదర్శి, ఎఫ్ ఆర్ సీ చైర్మన్ దీనికి పూర్తి బాధ్యత వహించాలని, తనకు ఎలాంటి సంబంధం లేదంటూ గ్రామస్తుల ముందు కారోబార్ ఐలుమల్లు వాపోయాడు. దీనిపై గ్రామస్తులను వివరణ కోరగా ఏజెన్సీ ప్రాంతం బీసీలకు పట్టాలుంటే ఎక్కడ ఏజెన్సీ ఎత్తివేస్తారని భయంతోనే సర్వేలో మా దరఖాస్తులు ఆన్ లైన్ చేయకుండా ఆపేవేశారని, తమకు న్యాయం చేయాలన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యేను సైతం కలవడానికి ప్రయత్నం చేస్తామని, తమకు పట్టాలు వచ్చే వరకూ ఎక్కడికైనా వెళ్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉపేందర్, బొమ్మగాని నవీన్, రాగం మల్లేష్, వార్డ్ మెంబర్ పోసాని రాజన్న, మూడ్ వెంకన్న, కార్యదర్శి ప్రవీణ, మేకల శ్రీను, రాగం కొమురయ్య, జలగం బాబు, బొల్లు మురళి పాల్గొన్నారు.
మంగళవారిపేట జీపీ సిబ్బందిపై గ్రామస్తుల ఆగ్రహం
RELATED ARTICLES
Recent Comments