తాతాల కాలం నుంచి వస్తున్నా.. ఆచారం..
గరికె ఎందుకు వేస్తారో తెలుసుకోండి మరి
స్పాట్ వాయిస్, డెస్క్: గ్రహణం పడుతోంది అంటే.. పెద్దలు ఇంటిపైనా.. బియ్యం, బట్టలపై నీటి ట్యాంకులపై గరికె వేయాలని చెబుతుంటారు. అయితే గ్రహణానికి, గరికెకి సంబంధం ఏంటో చాలా మందికి తెలియదు. మరి గరికె ఎందుకు వేసుకుంటారో తెలుసుకుందాం మరి..
గ్రహణం ఏర్పడినప్పుడు హిందువులు ఎంతో నిష్ట పాటిస్తారు. సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా పూర్తయ్యేంత వరకు హిందువులు ఏమి ముట్టుకోరు. గ్రహణం ఉన్నంతసేపు ఒక పీడ సమయంగా భావిస్తూ ఉంటారు. ఈక్రమంలోనే ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలలో ఇంట్లో గరిక వేస్తుంటారు. ఇది ఇప్పటి సంప్రదాయం కాదు… తాతల కాలం నుంచి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే గ్రహణం ఏర్పడినప్పుడు ఆహార పదార్థాల్లో గరికే ఎందుకు వేస్తారు అన్నది మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. గ్రహణ సమయంలో భూమి మీదకి… అతి ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు ప్రసరించే ప్రమాదం ఉంది. అయితే గరికే అనేది యాంటీ రేడియేషన్ గుణాలను కలిగి ఉంటుంది. అందుకే గ్రహణం సమయంలో గరికను అన్ని పాత్రల పై ఉంచుతారు. ఇలా ఉంచడం వల్ల రేడియేషన్ ప్రభావం నుంచి కొంత మేర తప్పించుకోవచ్చని నమ్ముతారు.
Recent Comments