మంది పెళ్లిళ్లకు మంగళ హారతి పట్టినట్టుంది..
తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలపై రాకేష్ రెడ్డి ఫైర్..
రాజీనామా చేసి అభివృద్ధికి సహకరించాలని పిలుపు..
స్పాట్ వాయిస్, మునుగోడు- వరంగల్ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యే లు కేసీఆర్ దొడ్లో బానిసల్లా వ్యవహరిస్తున్నారని, కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్తే మోకాళ్ల ప్రదక్షిణలు చేయడం, వరంగల్ వస్తే పోటీ పడి మరీ కాళ్లపై పడడం, ఎక్కడైనా ఉప ఎన్నికలు వస్తే అక్కడ ఊర్లు పట్టుకొని తిరుగుడు తప్ప వారితో వరంగల్ కు పైసా ఉపయోగం లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. మునుగోడు, హుజురాబాద్ ల్లో ప్రభుత్వం కదిలి రావాలంటే వరంగల్ అభివృద్ధి జరగాలంటే నరేందర్, దాస్యం వినయ్ భాస్కర్ తక్షణమే రాజీనామా చేయాలని రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. అసలు వారి జాడెక్కడో చెప్పాలని, నెల రోజులుగా నియోజకవర్గాన్ని గాలికొదిలేసి మంది పెళ్లిళ్లకు మంగళ హారతి పట్టడానికి వెళ్లారని ఎద్దేవా చేశారు. వారి వారి నియోజకవర్గాలే సక్కగా లేవని, అలాంటి వారు మునుగోడు లో వెలగబట్టడానికి వెళ్లారని దుయ్యబట్టారు. ఓరుగల్లు ప్రజలు విలువైన ఓట్లు వేసి ఎన్నుకుంటే ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడ గల్లీ గల్లీ తిరుగుడం తప్ప సొంత గడ్డ కు ప్రత్యేకంగా వెలగబెట్టింది ఏమీలేదన్నారు. ఓరుగల్లు సమస్యల వలయంలో చిక్కుకొని విలవిల్లాడుతుంటే ప్రజలను గాలికొదిలేసి ఉప ఎన్నికల్లో అద్దె మైకుల్లెక్క ఊర్లు పట్టుకొని తిరుగుతున్నారన్నారు. కనీసం సిగ్గున్నట్టుగా కూడా వ్యవహరించడం లేదన్నారు. తూర్పు ఎమ్మెల్యే నరేందర్ ఒక గ్రామంలో మగ్గంపై కాళ్లేసి కూర్చుంటే పద్మాశాలి సోదరులు తన్నినంత పనిచేశారని, చివరకు సారీ చెప్పి తప్పించుకున్నాడన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే ఊర్లు పట్టుకొని యువతకు మద్యం పోస్తూ ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో బిజీ గా ఉన్నాడన్నారు. ఇక జిల్లా మంత్రి ఎర్రబెల్లి ఇక్కడ పట్టింపులేదుగానీ మునుగోడు కు పెద్ద కొడుకు లెక్క తిరుగుతాండని ఎద్దేవా చేశారు. మన దరిద్రానికి ఒక ఎంపీ ఉన్నా ఆయనకు పదవి పవర్ కూడా తెల్వదన్నారు.
రాజీనామాలతో సరి..
వరంగల్ లో సమస్యలకు సమాధానం దొరకాలన్నా, ఓరుగల్లు కు పట్టిన దరిద్రం పోవాలన్న వరంగల్ ప్రజా ప్రతినిధులు ముఖ్యంగా తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యే లు నరేందర్, దాస్యం వినయ్ భాస్కర్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇద్దరు ఎమ్మెల్యే లు రాజీనామా చేస్తే రింగు రోడ్డు పూర్తి అవుతుందని, రోడ్లు బాగుపడతాయని, కొత్త మాస్టర్ ప్లాన్ వస్తదని అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. రాజీనామా చేయకపోతే పదవిలో ఉండి మరి ఓరుగల్లుకు అన్యాయం చేసిన మిమ్మల్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా శిక్షిస్తారని రాకేష్ రెడ్డి హెచ్చరించారు.
Recent Comments