Saturday, September 21, 2024
Homeక్రీడలుధన్వాడ ప్రీమియర్ లీగ్ -7విజేత మహి హిట్టర్స్

ధన్వాడ ప్రీమియర్ లీగ్ -7విజేత మహి హిట్టర్స్

ధన్వాడ ప్రీమియర్ లీగ్ -7విజేత మహి హిట్టర్స్
స్పాట్ వాయిస్, కాటారం: కాటారం మండలంలోని శంకరంపల్లి క్రీడా మైదానంలో ఆదివారం ధన్వాడ ప్రీమియర్ లీగ్ -7 క్రికెట్ మ్యాచ్ మహి హిట్టర్స్ ,వర్సెస్ రానా క్రేజీ 11,జట్ల మధ్య హోరా హోరీగా సాగిన సమరంలో మహి హిటర్స్ విజయం సాధించిందని నిర్వాహకులు తెలిపారు.విజేతలకు శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు బహుమతి ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత గంజాయి, గుట్కా తదితర అలవాట్లకు దూరంగా ఉండాలని, క్రికెట్ మరియు ఇతర క్రీడల ద్వారా నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య ,శంకరంపల్లి సర్పంచ్ అంగజాల అశోక్ కుమార్, ధన్వాడ సర్పంచ్ జంగిలి నరేష్, ధన్వాడ ఎంపీటీసీ బోడా మమత నరేష్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గద్దె సమ్మిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కుంభం స్వప్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments