Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలువిద్యుత్‌వైరు తెగిపడి లారీ దగ్ధం

విద్యుత్‌వైరు తెగిపడి లారీ దగ్ధం

విద్యుత్‌వైరు తెగిపడి లారీ దగ్ధం

-చెల్పూర్ 353 జాతీయ రహదారిపై ఘటన
స్పాట్ వాయిస్, గణపురం: ప్రమాదవశాత్తు విద్యుత్‌వైరు తెగిపడటంతో ఓ లారీ దగ్ధమైంది. ఈ సంఘటన శనివారం మండలంలోని 353 జాతీయ రహదారి చెల్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఏపీ24- 9671 నెంబరు గల ఓ లారీ రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా కరెంట్ వైర్లు తెగిపడి నిప్పు చెలరేగి మంటలు అంటుకున్నాయి. ఇంతలో లారీ టైర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదాన్ని గమనించి స్థానికులు కేటీపీపీ ఫైర్ స్టేషను సమాచారం ఇవ్వడంతో ఫైర్ అధికారులు అక్కడికి వెళ్లి మంటలను ఆర్పివేయడంతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments