Thursday, November 14, 2024
Homeజాతీయండ్యామిట్.. గిట్లయిపాయె..

డ్యామిట్.. గిట్లయిపాయె..

డ్యామిట్.. గిట్లయిపాయె..
ఎమ్మెల్యేల ఎర కేసును తిరస్కరించిన కోర్టు

 స్పాట్ వాయిస్ , హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ట్రాప్ కేసులో సరైన ఆధారాలు లేవంటూ.. ముగ్గురు నిందితులకు రిమాండ్‌ విధించేందుకు అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిరాకరించారు. వారిని తక్షణమే విడుదల చేయాలని, 41 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చిన తర్వాతే విచారించాలని స్పష్టం చేశారు.
నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌ను పోలీసులు రాత్రి సరూర్‌నగర్‌లోని న్యాయమూర్తి జీ. రాజగోపాల్‌ నివాసానికి తీసుకెళ్లి ఆయన ఎదుట హాజరుపరిచారు. లంచం సొమ్ము లభించనందున ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

అనేక మలుపులు..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ముగ్గురు వ్యక్తులు ప్రలోభపెట్టారన్న కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్టు వర్తించదని… ఆధారాలు లేవని.. 41 సీఆర్​పీసీ కింద నోటీసులు జారీ చేసి ముగ్గురిని విచారించాలని కోర్టు పేర్కొంది. దీంతో న్యాయమూర్తి ఆదేశాల నేపథ్యంలో నిందితుల్ని విడిచిపెట్టామని శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు.

ముమ్మరంగా దర్యాప్తు..
ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని ముగ్గురు నిందితులపై సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై రాత్రి వరకు ముమ్మరంగా దర్యాప్తు జరిగింది. నిందితులు కోట్ల నగదు తీసుకొచ్చారని ప్రచారం జరిగినా దానికి సంబంధించిన ఆధారాలను పోలీసులు వెల్లడించలేదు. కానీ జాతీయస్థాయిలో ఒక కీలక నాయకుడి కార్యదర్శి మాట్లాడిన ఆడియో టేపులు లభించాయని పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరితే ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డికి 100 కోట్లు, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజ్‌, హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావుకు ఒక్కొక్కరికి 50 కోట్ల రూపాయల చొప్పున ఇస్తామంటూ ప్రలోభపెట్టారంటూ… రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను అరెస్టు చేసి సుదీర్ఘంగా పోలీసులు విచారించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments