Sunday, November 24, 2024
Homeక్రైమ్భోజనంలో బల్లి...

భోజనంలో బల్లి…

భోజనంలో బల్లి…

దేవరుప్పుల కస్తుర్బా పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌..

12 మంది విద్యార్థినులకు అస్వస్థత

స్పాట్ వాయిస్, జనగామ: జనగామ జిల్లా దేవరుప్పుల కస్తుర్బా పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. ఈ ఘటనలో 12 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురి అయ్యారు. విషయం తెలుసుకున్న నిర్వాహకులు వీరిని వెంటనే జనగామ ఏరియా హాస్పిటల్ కి తరలించి చికిత్స చేయిస్తున్నారు.. అయితే దోసకాయ కర్రీ లో బల్లి పడిందని.. దానినే తమకు పెట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. భోజనం తిన్న తరువాత కొద్ది మందికి వాంతులు.. విరోచనాలు అయ్యాయని..దీంతో
అస్వస్థతకు గురయ్యామని వారు పేర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లి దండ్రులు చాలా మంది జనగామ హాస్పిటల్ కి చేరుకున్నారు..
అయితే ప్రస్తుతం విద్యార్థుల ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని.. 24 గంటల పాటు చికిత్స అందాల్సి ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments