Friday, November 15, 2024
Homeరాజకీయంటీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల కట్టలు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల కట్టలు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ను కొనేందుకు యత్నం..
కోట్లల్లో డబ్బు పట్టివేత..

రాష్ట్ర రాజకీయాల్లో కలకలం..

స్పాట్ వాయిస్ , హైదరాబాద్: ఉప ఎన్నికతో రాష్ట్రం కుతకుత ఉడుకుతున్న వేళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఢిల్లీకి చెందిన వ్యక్తులు ప్రయత్నించారన్న ఆరోపణలు కలకలం రేపాయి. వీరంతా నగర శివారులోని ఫామ్‌హౌస్‌లో పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడటం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ, తిరుపతి, హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్‌లో నోట్ల కట్టలతో పట్టుబడడం చర్చగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో.. టీఆర్ఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వీరు రంగంలోకి దిగారనే సమాచారం అందడంతో పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డిని పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించేందుకు వారు ప్రయత్నించినట్టు సమాచారం వచ్చిందని పోలీసులు వెల్లడించారు. రెండ్రోజులుగా ఈ నలుగురూ.. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పక్కా సమాచారంతో తెలంగాణ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించారు. మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి అజీజ్ నగర్​లోని ఓ ఫామ్ హౌస్​లో ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుగుతున్న సమయంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరితో పాటు రూ.కోట్లలో నగదు స్వాధీనం చేసుకున్నట్టు వినికిడి. సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర మెయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌ వద్దకు చేరుకుని పరిశీలించారు. నోట్ల కట్టలతో పట్టుబడిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments