Saturday, November 16, 2024
Homeజాతీయంతీవ్ర తుఫాన్ గా సిత్రాంగ్

తీవ్ర తుఫాన్ గా సిత్రాంగ్

తీవ్ర తుఫాన్ గా సిత్రాంగ్
స్పాట్ వాయిస్ , హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ‘సిత్రాంగ్‌’ స్థిరంగా కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ తుపాను ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 21కి.మీ వేగంతో కదులుతుందని.. ప్రస్తుతం సాగర్‌ దీవికి 380కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ వెల్లడించింది. రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది. మంగళవారం ఉదయానికి బంగ్లాదేశ్‌లోని టికోనా దీవికి సమీపంలో బరిసాల్‌ వద్ద తీరాన్ని దాటే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. అనంతరం వాయుగుండంగా, ఆ తదుపరి అల్పపీడనంగా బలహీనపడుతుందని చెప్పింది. తుపాను ‘సిత్రాంగ్‌’ ప్రభావంతో తూర్పు తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తుపాను పరిసర ప్రాంతాల్లో 2.4 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడుతున్నట్లు ఐఎండీ వివరించింది. ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమబెంగాల్‌ తీర ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments