ఏకశిలలో దీపావళి వేడుకలు.
స్పాట్ వాయిస్ హన్మకొండ రూరల్:శాస్త్రీయతతో
ముడిపడిన సంప్రదాయాలను భవితకు వివరించాలనే ఉద్దేశంతో,చిన్నారులు ఎంతో ఇష్టపడే,సర్వమతాలు సంబురపడే దీపావళి పండుగ వేడుకలను ఐనవోలు మండలం, ఖమ్మం హైవేలోని ఏకశిల సీబీఎసీఈ, స్టేట్ స్కూల్ లో పాఠశాల అడ్మిన్ ఇంచార్జ్ ఎం.డీ. బాబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.విభిన్న ఆకృతులతో చిచ్చుబుడ్డి, క్రాకర్ బాంబులు,దివ్వె, లక్ష్మి దేవి దీపాలను అమర్చి భారత దేశ పుష్ప చిహ్నమైన తామర పుష్పాన్ని తయారుచేసి, దీపాలతో అలంకరించారు. విద్యార్థిని,విద్యార్థుల హర్ష ద్వానాలు,ఆనందోత్సవాల మధ్య దీపావళి పండుగా వేడుకలు అత్యంత.వైభవంగా నిర్వహించారు.
అనంతరం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతి రెడ్డి హాజరై మాట్లాడుతూ.. పాఠశాలలో ఇలాంటి వేడుకలు నిర్వహించడం ద్వారా మన సనాతన సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడం జరుగుతుందన్నారు. నరకుడు అనే రాక్షసుడిని సత్యభామ సహకారంతో శ్రీకృష్ణుడు సంహరించిన విధానం, దీపావళి ఆవశ్యకతను క్షుణ్ణంగా విద్యార్థులకు వివరించారు.అనంతరం సుమారు రెండు వేల మంది విద్యార్థులకు మిఠాయిలు పంచి,వారితో కలిసి టపాసులు కాల్చారు.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణమంతా పండుగ వాతావరణాన్ని తలపించేలా చేశారు.ఇంతమంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాఠశాల నిర్వాహకుల్ని ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ కూనూరు రవికిరణ్, ఉపాధ్యాయులు రాకేష్,నర్సయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు నరేష్,రవీందర్, సాయి, రజనీకర్,శాంతి, సంధ్య, అశోక్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఏకశిలలో దీపావళి వేడుకలు
RELATED ARTICLES
Recent Comments