ఎంజీఎం..
పాములున్నాయ్.. జాగ్రత్త..!
ఆస్పత్రిలో మళ్లీ కనిపించిన నాగు పాము
మేల్ సర్జికల్ వార్డులో సంచారం
పామును పట్టి చంపిన రోగి బంధువు
స్పాట్ వాయిస్ , వరంగల్: ఎంజీఎంలో మళ్లీ పాము కలకలం సృష్టించింది. పది రోజుల క్రితమే పాము కనిపించగా.. మళ్లీ ఆదివారం పాము వచ్చింది. నాగుపాము ఎంజీఎం ఆసుపత్రిలోని మేల్ సర్జికల్ వెస్ట్ వార్డులో ప్రత్యక్షం కావడం కలకలం సృష్టించింది. దీన్ని చూసి వార్డులోని పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది భయంతో వార్డులో నుంచి బయటకు పరుగులు తీశారు. చివరకు రోగి అటెండెంట్ ఒకరు ఈ నాగుపామును పట్టి చంపేశాడు.
ఎంజీఎం ఎలుకలు, పాములకు ఆవాసంగా మారుతోంది. వార్డుల్లోకి వచ్చి పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది మధ్య తిరుగుతున్నాయి. ఏ వార్డులో ఎక్కడ ఎలుకలు, పాములు ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొనడంతో పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులే కాదు ఆసుపత్రి సిబ్బంది సైతం ఆందోళనకు గురవుతున్నారు.
Recent Comments