Saturday, November 16, 2024
Homeజిల్లా వార్తలుముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలి

ముదిరాజులను బీసీ-ఏలో చేర్చాలి

ముదిరాజులను బీసీ-ఏ లో చేర్చాలి
– మెపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్
స్పాట్ వాయిస్, గణపురం: ముదిరాజ్ కులస్తులను బీసీ ఏ లో చేర్చాలని మెపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్ లో జిల్లా ప్రధాన కార్యదర్శి బండి దశరథం, ముదిరాజ్ బోయిని సాంబయ్య ముదిరాజ్ అధ్యక్షతన ముదిరాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (మెపా) కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్య , ఉపాధి, ఉద్యోగ సాధికారత కోసం ‘మెపా’ పనిచేస్తుందని అన్నారు. ముదిరాజ్ ల జనాభా ప్రకారం చట్టసభల్లో సీట్లు దక్కేలా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ పంపిణీ సరిగా లేదని ముదిరాజ్ లకు బీసీ -D గ్రూపుతో చాలా అన్యాయం జరుగుతోందని వెంటనే బీసీ -A గ్రూపులో కలపాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మండల కమిటీ ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా రాణబోయిన కోటేష్, ఉపాధ్యక్షులుగా మలవేణి రాకేష్, కందుల రాజా, ప్రధానకార్యదర్శిగా అల్లం రవీందర్, సంయుక్త కార్యదర్శి పిట్టల భాస్కర్, పిట్టల శివ, అల్లే రాజు, కోశాధికారి మాల రమేష్, కార్యవర్గ సభ్యులు మాల రమేష్, మూడేడ్ల నవీన్, మలవేణి సారంగం మాల నగేష్, న్యాయ సలహాదరుడిగా మాల ప్రశాంత్ ను ఎన్నుకొన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు చాడ కిష్టస్వామి, జిల్లా కార్యదర్శి చాగర్తి లక్ష్మీనారాయణ, మెపా జిల్లా ప్రధానకార్యదర్శి బండి దశరథం, జిల్లా ఉపాధ్యక్షడు మోటం రమేష్, జోడు ప్రదీప్ ముదిరాజ్, బండి మల్లయ్య, బొల్లా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments