Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్సీఏను తొలగించాలి.. సొమ్ము రికవరీ చేయాలి..

సీఏను తొలగించాలి.. సొమ్ము రికవరీ చేయాలి..

ఖానాపురం లో ఉద్రిక్తత

అవినీతికి పాల్పడిన సీఏను సస్పెండ్ చేయాలని గ్రామస్తులు ఆందోళన

జాతీయ రహదారిపై బైఠాయించిన గ్రామస్తులు

స్పాట్ వాయిస్ , నర్సంపేట (ఖానాపురం): ఖానాపురం మండల కేంద్రంలో ఉధృత నెలకొంది. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన మహిళా సంఘాల సీఏ విజిత గ్రామంలోని పలు మహిళా సంఘాల కు తెలియకుండా వారి పేరు మీద లోన్లు ఎత్తుకొని అవినీతికి పాల్పడింది. ఈ విషయమై గతంలో మహిళా సంఘాల వారు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణకు వచ్చిన ఏపీఎం సుధాకర్ సీఏ కి అనుకూలంగా మాట్లాడుతున్నాడని అధికారులను గదిలో బంధించారు. ఇప్పటివరకు మహిళా సంఘాల సొమ్ము తిరిగి చెల్లించకపోవడంతో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అవినీతికి పాల్పడిన సీఏను విధుల్లోంచి తొలగించి అవినీతికి పాల్పడిన సొమ్మును  రికవరీ చేయాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పోలీసులు వచ్చినా రోడ్డుపైనే బైఠాయించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments