Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్నెక్ట్స్ సీఎం కేటీఆర్

నెక్ట్స్ సీఎం కేటీఆర్

ఇది వంద శాతం పక్క
దేశ రాజకీయాల్లోకి కేసీఆర్
మునుగోడులో బీజేపీ కుట్రలు చేస్తోంది..
మంత్రి శ్రీనివాస్ గౌడ్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: కేసీఆర్ తర్వాత రాష్ట్రానికి కేటీఆరే సీఎం అవుతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేటీఆర్‌కు సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలున్నాయని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ బీజేపీని ఎదుర్కొనేందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని చెప్పారు. ఆ తర్వాత కేటీఆరే సీఎం అవుతారని స్పష్టం చేశారు. వందకు వంద శాతం రాష్ట్రానికి నెక్ట్స్ సీఎం కేటీఆరే అని..ఈ విషయాన్ని పార్టీలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. టీఆర్‌ఎస్‌ ఎల్పీ భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేక బీజేపీ గుర్తులతో రాజకీయం చేస్తోందంటూ శ్రీనివాస్‌ గౌడ్‌ విమర్శించారు. కారును పోలిన గుర్తులతో ఓట్లు చీల్చేందుకు కుట్ర చేస్తోందన్నారు. బీజేపీకి ఎన్నికల సంఘం కూడా సహకరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నేతలు మాట్లాడుతున్న తీరు సరిగా లేదని మంత్రి అన్నారు. మునుగోడు ప్రజలు బీజేపీని ఛీ కొడుతున్నా ఆ పార్టీ నేతలకు బుద్ధి రావడం లేదని విమర్శించారు. రాష్ర్టంలో మత కల్లోలాలు రేపే కుట్రకు బీజేపీ తెర లేపుతోందని మంత్రి ఆరోపించారు. మత ఘర్షణలు రేపి ఓట్లు దండుకోవడం తప్ప బీజేపీకి ఏమీ చేతకాదన్నారు. కేంద్రంలో చేసింది చెప్పుకోవడం చేతకాకనే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల మీద విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. కేసీఆర్‌.. నల్లగొండ నుంచి ఫ్లోరోసిస్‌ను తరిమికొట్టారు.. సొరియాసిస్‌ లాంటి బీజేపీని కూడా సాగనంపుతారని అన్నారు. ధర్మం టీఆర్‌ఎస్‌ వైపు ఉంటే.. అధర్మం బీజేపీ వైపు ఉంది. 8 ఏండ్ల బీజేపీ పాలనలో ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ అబద్దపు హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. అవే హామీలను ఇప్పుడు మునుగోడులో ఇస్తోందన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments