Monday, November 25, 2024
Homeక్రైమ్కుటుంబాన్ని మింగిన కలహాలు, ఆర్థిక ఇబ్బందులు

కుటుంబాన్ని మింగిన కలహాలు, ఆర్థిక ఇబ్బందులు

కుటుంబాన్ని మింగిన కలహాలు, ఆర్థిక ఇబ్బందులు

స్పాట్ వాయిస్ , హైదరాబాద్: తీవ్ర విషాదం.. ఆర్థిక ఇబ్బందులు కుటుంబాన్ని మింగిన కన్నీటి ఘటన. హృదయాన్ని కలిచివేసే ఈ ఘటన హైదరాబాద్​ చందానగర్ పోలీస్​స్టేషన్ పరిధిలో జరిగింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో ఓ ఇంట్లో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్​లోని రాజీవ్ గృహకల్పలో ఏడేళ్లు గా నాగరాజు దంపతులు నివాసం ఉంటున్నారు. శుక్రవారం నుంచి వారు ఇంటి నుంచి బయటకు రాలేదు. సోమవారం ఉదయం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వారి ఇంటి తలుపు కొట్టారు. తలుపు కొట్టినా తీయకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా నలుగురు విగతజీవులుగా పడి ఉన్నారు. మృతులు నాగరాజు ఆయన భార్య సుజాత పిల్లలు రమ్యశ్రీ, టిల్లుగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments