Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్టీఆర్ఎస్‌ను భయపెడుతున్న 8 గుర్తులు

టీఆర్ఎస్‌ను భయపెడుతున్న 8 గుర్తులు

ఇంతకు  ఏంటా సింబల్స్..?
ఎందుకంతా భయం..
ఎవరికీ కేటాయించొద్దంటూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు..
పట్టించుకోవడం లేదంటూ హైకోర్టులో పిటిషన్
స్పాట్ వాయిస్, బ్యూరో: మునుగోడు ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలకు చావోరేవో. దీంతో ప్రతీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం సాగిస్తుంది. ఇక అధికార పార్టీకి ఈ ఎన్నికల భవితవ్యాన్ని తేల్చేవే. దీంతో ఆ పార్టీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలో ఆ పార్టీని 8 గుర్తులు వేధిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులకు.. నిరక్షరాస్యులకు అర్థం కాకపోవడంతో వాళ్లు కారు గుర్తుకు వేయాల్సిన ఓటు ఇతర సింబల్స్‌పై వేశారు. ఆ విషయం గత ఫలితాల్లో చాలా స్పష్టంగా కనిపించింది. హుజూర్‌నగర్‌, హుజూరాబద్ ఉప ఎన్నికల్లో కూడా ఓట్లు ఆ సింబల్స్ పై భారీగా పడ్డాయి. ఈ క్రమంలో ఈసారి ఆ పార్టీ ముందస్తుగా మేల్కోంది. కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను అభ్యర్థులెవరికీ కేటాయించొద్దంటూ రాష్ట్ర ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేసింది. తమ పార్టీ గుర్తు కారు గుర్తును పోలి ఉన్న 8 గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌ను వారం రోజుల క్రితమే కోరారు. ఆ జాబితాను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని సూచించారు. ఆ గుర్తులు కేటాయిస్తే తమ అభ్యర్థికి వచ్చే ఓట్లు పోతున్నాయని పేర్కొంది. గత ఎన్నికల్లో అలానే జరిగిందంటూ పేర్కొంది. మళ్లీ ఆ సమస్య పునరావృతం కాకుండా ఉండేలా కారును పోలిన గుర్తును ఫ్రీ సింబ‌ల్స్ జాబితా నుంచి తొల‌గించాల‌ని కోరారు.

హైకోర్టుకు టీఆర్ఎస్
మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన 8 గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. శనివారం హౌజ్ మోషన్ పిటిషన్ వేయగా..అంత అర్జెంట్ ఏముందంటూ న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ వేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన 8 గుర్తులు కెమెరా, చపాతి రోలర్, డోలీ, రోడ్డు రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టుమిషన్, ఓడ గుర్తులు ఎవరికి కేటాయించవద్దని… ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించాలని టీఆర్ఎస్ ఇప్పటికే ఈసీకి లేఖ రాసింది. ఈసీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది.

New Doc 10-10-22 16.18

RELATED ARTICLES

Most Popular

Recent Comments