జైలులో సెక్స్ కూడా చేసుకోవచ్చు..
పడక సుఖాన్ని అమలు చేస్తున్న పంజాబ్ ప్రభుత్వం..
కొత్త ఆలోచనపై ఖైదీల హర్షం
నిజంగా ఏమి జాతకాలండి..! తప్పుచేసి జైళ్లకు వెళ్లిన వారు, శిక్షను అనుభవించడం తెలిసిందే. కానీ, అదే సమయంలో ఎంచక్కా ఎంజాయ్ కూడా చేసే యోగం వారిని వరించింది. జైలు కూడు తినితిని మొద్దుబారిపోకుండా, వారిలో కలిగే విరహ వేదనను తీర్చడానికి పంజాబ్ సర్కార్ కొత్త సదుపాయం కల్పించింది. శిక్షను అనుభవిస్తున్న నిందితుడు లేదా ముద్దాయికి శారీరక సుఖాన్ని అందించేందుకు ప్రత్యేకంగా గది, ఏకాంతంగా గడపడానికి రెండు గంటల సమయం., ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి సరైన వాతావరణం, అదీ చాలదంటే ఇంకా వగైరా వగైరా సదుపాయాలు కల్పించింది. ఇక్కడ ఇంకో ఫెసిలిటీ కూడా ఉందండోయ్.. ముందస్తు జాగ్రత్తగా కండోమ్స్ ప్యాకెట్లు కూడా జైలు అధికారులే అందుబాటులో ఉంచారు. ఇంకేం జైలు లోపల భర్త ఉంటే భార్య, లేదంటే భార్యే ఉంటే భర్త ములాఖత్ కు వెళ్లి హాయిగా రెండు గంటలు గడిపి రావొచ్చు. జైలులో ఇంతకన్నా భాగ్యం ఉంటుంది చెప్పండి. కాగా, పంజాబ్ గోయింద్ వాల్ జైలులో ఈ పథకాన్ని మొదటి సారిగా ఉపయోగించుకున్న వ్యక్తి గుర్ జీత్ సింగ్. ఈయన ఓ హత్యానేరంలో జైలు శిక్ష అనుభవిస్తున్న 60 ఏళ్ల వ్యక్తి. కాగా ప్రస్తుతం ఈ సదుపాయం సెప్టెంబర్ 20న పంజాబ్ లోని మూడు జైళ్లలో అమలులోకి తేగా, ఈ నెల 3వ తేదీ నాటికి 17 జైళ్లకు విస్తరించారు. పంజాబ్ లో ఇంకో ఎనిమిది జైళ్లు ఉన్నాయి. వాటిలో కూడా అమలుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
వెరీ గుడ్ ఆఫీసర్స్..
ఖైదీలు రగిలిపోకుండా చల్లబర్చేందుకు మీరే స్వయంగా ఏర్పాట్లు చేయడం నిజంగా మీ ఔదార్యమే..
-స్పాట్ వాయిస్, డెస్క్
Recent Comments