Saturday, November 23, 2024
Homeజనరల్ న్యూస్ఖబర్దార్ కిషన్ రావు

ఖబర్దార్ కిషన్ రావు

ఆరె సంఘాన్ని విమర్శించే అర్హత నీకు లేదు..
సంఘానికి నువ్వేం చేసావ్ ?
రాజకీయంగా ఎదగడానికే నాగుర్లను విమర్శిస్తున్నావ్..
కవ్వింపు చర్యలకు దిగితే కటకటాల పాలైతవ్..
రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ,  వివిధ జిల్లాల అధ్యక్షులు  

స్పాట్ వాయిస్, హన్మకొండ : ఆరె సంఘాన్ని విమర్శించే అర్హత లింగంపెల్లి కిషన్ రావుకు లేదని, రాజకీయంగా ఎదగడానికి నాగుర్ల ను విమర్శిస్తే, కుల సంఘం విషయంలో కవ్వింపు చర్యలకు దిగితే కటకటాలపాలు కాకతప్పదని ఆరె సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ హెచ్చరించారు. ఆదివారం హన్మకొండ బాలసముద్రంలోని ఆరె సంఘ భవనంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ అధ్యక్షతన జిల్లాల అధ్యక్షుల ముఖ్యులు, రాష్ట్ర నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు, జిల్లాల అధ్యక్షులు మాట్లాడుతూ
రెండు రోజుల క్రితం సంఘంతో సంబంధంలేని వ్యక్తులతో లింగంపల్లి కిషన్ రావు తనయుడు నానాజీ మీడియా సమావేశం పెట్టడాన్ని, నాగుర్ల వెంకన్నతోపాటు చెట్టుపల్లి శివాజీ పై చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు.

రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపెల్లి శివాజీ మాట్లాడుతూ
నాగుర్ల వెంకన్న ఆరె కుల బంధువులందరి అభ్యర్థన మేరకు ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారన్నారు. ఆరె సంక్షేమ సంఘం కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం లేదని, ప్రభుత్వం నుంచి ఆరె సంఘానికి అవసరమైన సంఘ భవనాల నిర్మాణం కోసం నిధులు ఇప్పించడం, సంఘ భవనాలకు స్థలాలు ఇప్పించడం, అవసరమైన కుల బంధువులకు మాత్రమే తన సేవలు అందిస్తున్నారన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులంతా తీసుకునే నిర్ణయాల్లో ఏ రోజు జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. స్టీరింగ్ కమిటీ నుంచి లింగంపల్లి కిషన్ రావును తొలగించడం రాష్ట్ర కమిటీ, వివిధ జిల్లాల ముఖ్య నేతల నిర్ణయమన్నారు. కానీ, ఈ అంశాన్ని కిషన్ రావు రాజకీయంగా నాగుర్ల ఇమేజ్ ను దెబ్బతీయడానికి చేసే ప్రయత్నాన్ని సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. తన భార్యకు జెడ్పీటీసీ టికెట్ కోసం, ఆర్థికసాయం కోసం లింగంపెల్లి కిషన్ రావు భార్యాభర్తలు నాగుర్ల కాళ్లు మొక్కింది మర్చిపోయారా అని ప్రశ్నించారు. సర్పంచ్ గా పోటీ చేసిన నాడు నాగుర్ల కుటుంబం సహకారం లేకుంటే కిషన్ రావుకు రాజకీయ భవిష్యత్తు లేదనే విషయాన్ని ఆయన మర్చి పోవద్దన్నారు.

రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మోర్తా చందర్ రావు మాట్లాడుతూ
లింగంపెల్లి కిషన్ రావు కులానికి సేవచేసింది నిజమైతే తండ్రి కోసం కొడుకు, కొందరు స్వార్థపరులను పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టవల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కులం పేరుతో, పార్టీ పదవులను అడ్డుపెట్టుకొని వసూళ్లకు పాల్పడింది ఎవరో తేల్చుకోవడానికి బహిరంగ చర్చకు లింగంపెల్లి కిషన్ రావు సిద్ధమా? అని, ప్రెస్ మీట్ పెట్టిన తన కొడుకు నాగుర్ల వెంకన్న కు, చెట్టుపెల్లి శివాజీ కి ఆరె కులానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధారి మీటింగ్ తరువాత ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో కమిటీ మీటింగ్ పెట్టి అందరూ ఏకగ్రీవంగా చెట్టుపెల్లి శివాజీని రాష్ట్ర అధ్యక్షుడిగా, వివిధ కమిటీల బాధ్యులను నియమించింది మర్చిపోయి మాట్లాడం హాస్యాస్పదమన్నారు. ఆరె సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులైన నాగుర్ల వెంకన్న ని రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపెల్లి శివాజీ ని సంఘం నుంచి బర్తరఫ్ చేయాలని కోరే అధికారం గానీ, బర్తరఫ్ చేసే హోదా కానీ ఎవరికి లేదని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదగడానికి నాగుర్లను విమర్శించడం సరికాదని, నీ గ్రామమైన నర్సక్కపల్లెలో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు.

ఉమ్మడి జిల్లా అధ్యక్షులు హింగె శివాజీ, వంచనగిరి వీరేశం, ఇంగ్లే శివాజీ, ల్యాద శ్యాం రావు మాట్లాడుతూ ఆరె సంక్షేమ సంఘంలో గ్రామ, మండల, జిల్లా కమిటీలు అన్నీ కూడా ఏకతాటి పై పనిచేస్తుంటే, సంఘాలను కొందరి జేబు సంస్థ అని విమర్శించడం కులాన్ని, సంఘాన్ని అగౌరవపరచడం కాదా? అని ప్రశ్నించారు. లింగంపల్లి కిషన్ రావు భార్యకు టికెట్ ఇప్పించడం దగ్గర నుంచి గెలుపు బాధ్యతను భుజాన వేసుకుని అన్ని విధాలా సాయం చేసిన నాగుర్లను విమర్శించడం సరికాదన్నారు. నాగుర్ల వెంకన్న సహకారంతో రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపెల్లి శివాజీ నాయకత్వంలో రాష్ట్ర కమిటీ ఓబీసీ అంశాన్ని కేంద్ర స్థాయిలో కీలక దశకు చేర్చిన సమయంలో పేరు, ఊరు లేని సంస్థలతో, ఆరె సంక్షేమ సంఘంతో సంబంధం లేని వ్యక్తులతో విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఆరె సంక్షేమ సంఘం కిషన్ రావు జేబు సంస్థగా భావిస్తున్నారని, ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినా, సంబంధంలేని వ్యక్తుల గురించి ప్రస్తావించిన చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు నాగుర్ల శంకర్ రావు, భలేరావు మనోహర్ రావు, జెండా రాజేష్, గుండెకారి రంగారావు, మారుజోడు రాంబాబు, నర్సింహారావు, వలిగే సాంబరావు, సుధాకర్ రావు, మటికె సంతోష్, హింగె మహేందర్ జీ, అడగాని జగన్మోహన్, శివ, కృష్ణ, శ్రీనివాస్, బాపురావు, యుగేందర్, నాగరాజు, సంజీవ రావు, గుణాకర్, హరీష్, రాకేష్, మహేందర్ తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఆరె సంఘం నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments