బీసీ దామాషా ప్రకారం చట్ట సభల్లో సీట్లు కేటాయించాలి
పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్ డిమాండ్
వరంగల్ లో ప్రధానమంత్రికి కోటి ఉత్తరాల కార్యక్రమం
స్పాట్ వాయిస్, వరంగల్ : దేశ వ్యాప్తంగా బీసీ జన గణన వెంటనే చేపట్టాలని పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సామాజిక వేత్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ ఆధ్వర్యంలో బీసీ గణన వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం వరంగల్ పోపా ఆధ్వర్యంలో ఉత్తరాల పోస్టింగ్ కార్యక్రమాన్ని శివనగర్ లో చేపట్టారు. అనంతరం వరంగల్ ముఖ్య తపాలా కేంద్రం వద్ద ఉత్తరాలను ప్రధానమంత్రికి పోస్ట్ చేశారు. అనంతరం తెలంగాణ పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే బీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీ దామాషా ప్రకారం చట్ట సభల్లో సీట్లు కేటాయించాలని, బీసీలకు ప్రాధాన్యత పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పోపా వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుండు కామేశ్వర్, కందకట్ల భాస్కర్, పెద్దురి పెద్దన్న, కుడికాల సుధాకర్, సదానందు, బూర రమేష్, విజయ్ ముత్యాల, మెరుగు సుభాష్, పాము శ్రీనివాస్, చెన్నూరి రమేష్, మాటేటి అశోక్, సంతోష్, శామంతుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments