అంతిమ విజయం సైన్స్ దే…
కేయూ వీసీ ఆచార్య తాటికొండ రమేష్
వాగ్దేవి విద్యాసంస్థల ఆడిటోరియంలో జన విజ్ఞాన వేదిక హన్మకొండ జిల్లా నాలుగో వార్షిక సభలు
స్పాట్ వాయిస్, హన్మకొండ : శాస్త్ర సాంకేతిక రంగాలతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ అన్నారు. జన విజ్ఞాన వేదిక హన్మకొండ జిల్లా నాలుగో వార్షిక సభలు ఆదివారం వాగ్దేవి విద్యాసంస్థల ఆడిటోరియంలో ఆచార్య కాశీనాథ్ అధ్యక్షతన జరిగాయి. ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల వేణు స్వాగత వచనాలు పలకగా, ప్రారంభ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆచార్య రమేష్ మానవ పరిణామ క్రమంలో వాద ప్రతివాదం, చర్చలతోనే సమస్యలకు పరిష్కారం లభించిందని, అందుకు శాస్త్ర సాంకేతిక రంగాలు తోడ్పడ్డాయన్నారు. ప్రశ్నించే తత్వం, హేతువాద దృక్పథం, సైన్స్ పద్ధతిలో, జీవనంతోనే సామాజిక అభివృద్ధి జరుగుతుందన్నారు. సైన్స్ కు మతానికి ఎప్పటికీ సంఘర్షణ జరుగుతున్నా అంతిమ విజయం సైన్స్ దేనన్నారు.
విశిష్ట అతిథిగా హాజరైన పూర్వ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునే శక్తి మనిషికే ఉందన్నారు. ప్రజలు చైతన్యమై సమస్యల పరిష్కారాలు వెతుక్కునే దిశగా జనవిజ్ఞానిక వేదిక వివిధ కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు.
జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్ మాట్లాడుతు రానున్న రోజుల్లో జాతీయ విద్యా పాలసీపై విస్తృతంగా ప్రజా బహుళయంలో పాలసీ బలాలు బలహీనతలపై చర్చలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతీ పాఠశాలలో సైన్స్ క్లబ్బుల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
తర్వాత జరిగిన వైజ్ఞానిక సదస్సులో శాస్త్రీయ దృక్పథం- ప్రస్తుత అవసరం అనే అంశంపై ఆచార్యులు రామచంద్రయ్య, సైబర్ నేరాలు- జాగ్రత్త చర్యలు అనే అంశంపై ఆచార్య ఎల్ ఆంజనేయులు, పర్యావరణ సమస్యలు -పరిష్కారాలు అనే అంశంపై రిటైర్డ్ జిల్లా అటవీ శాఖ అధికారి కె.పురుషోత్తం మాట్లాడారు. సాంస్కృతిక కమిటీ సభ్యులు మొగిలి, ఎర్రన్న, చంద్రమౌళి బృందం ఆలపించిన చైతన్య గీతాలు ఆహుతులను అలరించాయి. అనంతరం జరిగిన ప్రతినిధుల సదస్సులో గత సంవత్సర కాలంలో చేసిన కార్యక్రమాల నివేదికను ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల వేణు, ఆర్థిక నివేదికను డాక్టర్ శ్రీనివాస్ ప్రవేశపెట్టగా, వివిధ మండలాల నుంచి హాజరైన ప్రతినిధులు చర్చలో పాల్గొని నివేదికలను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ధర్మ ప్రకాష్, సుమలత, జిల్లా నాయకులు డాక్టర్ రాములు, డాక్టర్ రవికుమార్, ఉమామహేశ్వర్, సత్య ప్రకాష్, ప్రభాకరాచారి, డాక్టర్ జ్యోతి, సునిత, మంజుల, శ్రీనివాస్, డాక్టర్ అజయ్, సురేష్, డాక్టర్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జనవిజ్ఞాన వేదిక జిల్లా వార్షిక సభ తీర్మానాలు ..
1). దేవునూరు ఇనపరాతి గట్లు హనుమకొండ జిల్లాకు ఆయువుపట్టు. ఈ ప్రాంతం జీవ వైవిధ్యానికి ప్రత్యేకం కాబట్టి ఇక్కడ జరిగే మైనింగ్ ఇతరత్రా అక్రమాలను నిలిపివేసి “రక్షిత అడవి”గా ప్రకటించాలి.
2). రీజినల్ సైన్స్ సెంటర్ కు మరిన్ని శాస్త్ర సాంకేతిక హంగులు కల్పించి, సైన్స్ ప్రయోగాలు ద్వారా విద్యార్థులు ప్రదర్శనలు చూసేలా తగు సిబ్బందిని సమకూర్చి ఆధునీకరించాలి.
3). కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం పనులు సత్వరమే పూర్తి చేసి వరంగల్ త్రినగరి ప్రజలకు అందుబాటులోకి తేవాలి.
4). రోజురోజుకూ హనుమకొండ నగరంలో రవాణా రద్దీ పెరుగుతున్నందున ఫాతిమానగర్ రెండో ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు ప్రజల సౌకర్యార్థం త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.
5). కేజీ టు పీజీ విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులను నియమించాలి.
6. ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు సరిపడా మందులు, సిబ్బంది నియామకం సౌకర్యాలను మెరుగుపరచాలి.
7).మహిళలపై దాడులు, దేవదాసి, జోగిని వ్యవస్థల రద్దు చేస్తూ మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని చేయాలి.
Recent Comments