స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయనం. విజయ దశమి రోజు కొత్త జాతీయ పార్టీ ఆవిర్భవించింది. దేశ ప్రజల అభ్యున్నతిని కాంక్షిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరునే భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ ఆయన అధికారిక ప్రకటన చేశారు. టీఆర్ఎస్ పేరును మారుస్తూ బుధవారం నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు ఆ తీర్మానంపై సంతకం చేశారు. దీంతో 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటు చేసుకుంది. సుమారు 8 రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా సమావేశానికి హాజరయ్యారు.
తెలంగాణ రాజకీయ చరిత్రలో నవశకానికి నాంది
జాతీయ పార్టీని ప్రకటించిన సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ – భారత్ రాష్ట్ర సమితి..
బీజేపీ విద్వేష నిరంకుశత్వంపై రణభేరి మోగింది
భూమిపుత్రుడి సంకల్పం నవశకానికి నాంది పలికింది
తెలంగాణ ధరిత్రిమీద ఇదొక చైతన్యకాంతుల నవోదయం
దేశంలోని విష భుజంగాల పీచమణిచే సమర శంఖారావం
తిరోగమన భారతం పురోగమించేందుకు నవ సంకల్పం
తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా రూపాంతరం
విజయానికి సంకేతమైన విజయదశమినాడు మరో ప్రయాణం
ఆనాడు తెలంగాణ స్వపరిపాలన కోసం పోరాటం
నేడు దేశ ఉజ్వల భవిష్యత్ కోసం ఆరాటం
జాతిహితం కోసం తెలంగాణే మోడల్
జనహితం కోసం కేసీఆరే లీడర్
Recent Comments