Sunday, November 24, 2024
Homeతెలంగాణమహిళా సీఐ ఇంటికి మరో సీఐ..

మహిళా సీఐ ఇంటికి మరో సీఐ..

మహిళా సీఐ ఇంటికి మరో సీఐ..
పట్టించిన భర్త సీఐ..

దారిన పెట్టాల్సిన ‘డ్యూటీ’ గాడి తప్పింది. అక్రమార్కుల పై ఉండాల్సిన నిఘా అడ్డదారులు తొక్కింది. న్యాయాన్ని రక్షించాల్సిన నాలుగో సింహం నవ్వుల పాలయ్యే పని చేసింది. ఆచీతూచి వ్యవహరించాల్సిన అధికారం, ఎవరు చూడరనుకున్నారో.., చూ’సీ’నా… ‘ఐ’య్యేది ఏముందిలే అని తెగించారో గానీ సభ్య సమాజం అసహించుకునేలా, అయినవారు తల దించుకునే ప్రవర్తించారు. నలుగురిలో ఉంటూ, అందరికి ఆదర్శంగా ఉండాల్సిన వారు నాలుగ్గోడల మధ్య ఏకాంతం పట్టుబడి నడి వీధిలో నిలబడ్డారు. మొత్తం గా ముగ్గురు సీఐ ల తో ముడిపడిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. హన్మకొండ లో చోటు చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. వివరాలిలా ఉన్నాయి.

స్పాట్ వాయిస్, క్రైం: ఒకే విభాగంలో పని చేస్తున్నామనే చనువో.. లేక మరే.ఇతర కారణమో కానీ.. మహిళా సీఐ ఇంటికి మరో సీఐ వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళా సీఐ భర్త (అతను కూడా సీఐయే) తన మిత్రులతో కలిసి… మరో సీఐను పోలీసులకు పట్టించాడు. ఈ ఘటన వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ సుబేదారీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సుబేదారీ సీఐ ఎండీ షుకుర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ రాంనగర్‌కు చెందిన ఓ మహిళా సీఐ వరంగల్‌ సీఐడీ కార్యాలయంలో పనిచేస్తోంది. అక్కడే బలభద్ర రవి అనే మరో ఇన్‌స్పెక్టర్‌ పనిచేస్తున్నాడు. వీరి మధ్య స్నేహం పెరిగింది. ఇద్దరు ఒకరి ఇంటికి మరొకరు వెళుతున్నారు. దీనిపై మహిళా సీఐ భర్తకు అనుమానం వచ్చింది. ప్రస్తుతం ఆయన మహబూబాబాద్‌ జిల్లాలో రూరల్‌ సీఐగా పని చేస్తున్నాడు. వారిని పట్టుకోవాలని చాలాకాలంగా వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం మహిళా సీఐ ఇంటికి సీఐ రవి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళా సీఐ భర్త వారిని పట్టుకున్నాడు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తాము ఆఫీస్‌ విషయాలు మాట్లాడుకుంటున్నామని వారు చెప్పారు. అయితే వారిద్దర్నీ మహిళా సీఐ భర్త పోలీసులకు అప్పగించారు. మహిళా సీఐ భర్త ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. రవి తన ఇంటికి అనుమతి లేకుండా వస్తున్నాడని, అడ్డుకున్న తనను చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments