Wednesday, November 27, 2024
Homeజిల్లా వార్తలునర్సంపేటలో గాంధీ, శాస్త్రీల జయంతి

నర్సంపేటలో గాంధీ, శాస్త్రీల జయంతి

కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ, శాస్త్రీల జయంతి
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని రాజేందర్ అధ్వర్యంలో మహాత్మా గాంధీ 153వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మహాత్మాగాంధీ సెంటర్ లోని బాపూజీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, నియోజకవర్గ కన్వీనర్ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అందించిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. అలాగే భారత దేశాన్ని ఐకమత్యంగా ఉంచడానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి అన్నారు. ఈ సందర్భంగా వీఆర్ ఏ డిమాండ్లను వెంటనే పరిష్కరించి, వారికి న్యాయం చేయాలని కాంగ్రెస్ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, పట్టణ మహిళా అధ్యక్షురాలు నూనె పద్మ, మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆడెపు రమ, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు మెరుగు సాంబయ్య, కిసాన్ సెల్ పట్టణ అధ్యక్షుడు ముత్తినేని వెంకన్న, ఓబీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచర్ల వెంకన్న, పట్టణ ఉపాధ్యక్షుడు నాడెం నగేష్, పట్టణ యూత్ అధ్యక్షుడు ములకల మనీష్, మండల యూత్ జనరల్ సెక్రటరీ బొంత రంజిత్, నాయకులు కాట ప్రభాకర్, మాదాసి రవి, లక్కాసు రమేష్, నర్సిరెడ్డి, రామగోని శ్రీనివాస్, దూడల సాంబయ్య, గద్ద సంజీవ, పంబి వంశీకృష్ణ, గోపగాని మహేందర్, గద్ద అఖిల్, దేశి సాయి పటేల్ తదితర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments