బాపూజీ, శాస్త్రి ఆశయాలను సాధించాలి
4వ బెటాలియన్ కమాండెంట్ డి. శివప్రసాద్ రెడ్డి
స్పాట్ వాయిస్, మామునూరు : నాలుగో బెటాలియన్ మామునూరు క్యాంపులో జాతిపిత మహాత్మా గాంధీ 153 వ జయంతి, భారత దేశ రెండో ప్రధాని దివంగత లాల్ బహుదూర్ శాస్త్రి 118 వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 4వ బెటాలియన్ కమాండెంట్ డి. శివప్రసాద్ రెడ్డి బెటాలియన్ అధికారులు, సిబ్బందితో కలిసి గాంధీ, శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమాండెంట్ శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన పాత్ర ఎనలేనిదన్నారు సత్యం, అహింస, సహనం ద్వారా గాందీజీ బ్రిటిష్ వారిని పారద్రోలి భారత దేశానికి స్వాతంత్రం తెచ్చేందుకు తన జీవితాన్ని త్యాగం చేశారని గుర్తు చేశారు. మహాత్ముడి మార్గంలో మనం నడవడం ద్వారా వారి ఆశయాలను ఆచరించినవారమవుతామన్నారు. లాల్ బహుదూర్ శాస్త్రి నైతిక విలువలకు మారుపేరని, అధికారాన్ని ఎప్పుడూ కూడా తన సొంత వారికి ఏ మాత్రం వినియోగించకుండా దేశ ప్రజల శ్రేయస్సు కోసమే విధులు నిర్వర్తించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ డి.నరేందర్ రెడ్డి, యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ కుమార్, ఆర్ ఐలు పురుషోత్తం రెడ్డి, దయశీల, నాగేశ్వరరావు, రాజ్ కుమార్, అశోక్, ఆర్ ఎస్సై అనిల్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి కి ఘన నివాళి
RELATED ARTICLES
Recent Comments