Saturday, November 23, 2024
Homeజాతీయంఇక 5జీ భారత్

ఇక 5జీ భారత్

నేటి నుంచి అందుబాటులో కి..
ప్రారంభించనున్న ప్రధాని మోడీ
స్పాట్ వాయిస్ , డెస్క్: నేటి నుంచి దేశంలో 5జీ సేవలు అందుబాటులో కి రానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగే ఆరో విడత ఇండియా మెుబైల్‌ కాంగ్రెస్‌ కార్యక్రమంలో ఈ ప్రారంభోత్సవం జరగనుంది. ప్రస్తుతం నిర్దేశిత నగరాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే రెండేళ్లలో యావత్‌ దేశమంతా 5జీ సేవలను విస్తరించనున్నాయి. 2035 నాటికి భారత్‌ను 450 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో 5జీ ముఖ్యపాత్ర పోషిస్తుందని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. 5Gతో కొత్త ఆర్థిక అవకాశాలు, సామాజిక ప్రయోజనాలను పెంపొందిస్తుందని తెలిపాయి. అలాగే నూతన ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, డిజిటల్‌ఇండియా విజన్‌ను చేరుకోవడానికి దోహదం చేస్తుందని పేర్కొన్నాయి. చైనా తర్వాత స్మార్ట్‌ఫోన్లకు అతిపెద్ద మార్కెటుగా ఉన్న భారత్‌లో 5జీ రాక.. ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments