స్పాట్ వాయిస్, హైదరాబాద్: అబార్షన్స్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. స్త్రీలు.. చట్టప్రకారం సురక్షిత అబార్షన్ చేయించుకోవచ్చని తేల్చి చెప్పింది. అయితే గర్భం దాల్చిన 24వారాల లోపు అబార్షన్ చేసుకునే వెసులుబాటు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ పరిధిలో పెళ్లి కాని మహిళలను కూడా చేర్చవచ్చని తెలిపింది. ఆబార్షన్‌కు పెళ్లికి ఎలాంటి సంబంధం లేదన్న సుప్రీంకోర్టు వివాహిత, అవివాహితులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. అబార్షన్ విషయంలో మహిళలకు మరొకరి అనుమతి అవసరంలేదని చెప్పింది. భర్త బలవంతంగా శృంగారం చేయడం వల్ల గర్భం వస్తే.. తొలగించుకునే హక్కు భార్యకే ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొన్నారు. అత్యాచార ఘటనలోనూ అబార్షన్ వర్తిస్తుందని తెలిపింది.
భార్యకు ఇష్టంలేని సెక్స్ అత్యాచారమే..
వైవాహిక అత్యాచారాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. భార్య సమ్మతి లేకుండా భర్త ఆమెతో బలవంతంగా కలిస్తే..అది కూడా అత్యాచారం కిందకే వస్తుందని స్పష్టం చేసింది. అది బలవంతపు గర్భధారణ కిందకు వస్తుందని తెలిపింది. ఇలాంటి గర్భధారణల నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎంటీపీ చట్టంలో అత్యాచారానికి అర్థంలో వైవాహిక అత్యాచారాన్ని కూడా చేర్చాల్సిన అవసరం ఉందని తెలిపింది.
Recent Comments