Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలుఆటల్లో గెలుపు ఓటములు సహజం

ఆటల్లో గెలుపు ఓటములు సహజం

ఇనుగుర్తి చరిత్ర ఎంతో గొప్పది
ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్
స్పాట్ వాయిస్, కేసముద్రం: క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో టెన్నిస్ వాలీబాల్ క్రీడాపోటీల ముగింపు సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇనుగుర్తి గ్రామంలో కందునూరి కొమురయ్య స్మారక టెన్నిస్ వాలీబాల్ స్టేట్ లెవల్ జూనియర్ అండ్ సబ్ జూనియర్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై ఎమ్మెల్యేలకు అయ్యగారిపల్లి గ్రామం నుంచి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో, డప్పు చప్పుల్లతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని జీవితంలో ఎదగాలన్నారు. ఇనుగుర్తి జాతీయ, అంతర్జాతీయ వ్యాప్తంగా పేరుగాంచినదని, ఈ గడ్డ నుంచి ఎంతో మంది క్రీడాకారులు ఉత్తమ ప్రదర్వన కనబర్చారన్నారు. ఇనుగుర్తి మండలం ప్రకటన అనంతర మొదటి సారిగా ఈ ఊరికి రావడం చాలా సంతోషంగా ఉందని, మండలం వచ్చిన సందర్భంగా గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రీడలలో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దార్ల రాంమూర్తి, ఎంపీపీ వోలం చంద్రమోహన్, జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి,పీఏసీఎస్ చైర్మన్ దీకొండ వెంకన్న, టెన్నిస్ వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహరావు, జిల్లా అధ్యక్షుడు శీలం.రాజిరెడ్డి, కార్యదర్శి ఎండీ ఇంతియాజ్, హెచ్ ఎం, పీఈటీ కొమ్ము రాజేందర్, ఎంపీటీసీలు పింగిళి రజిత శ్రీనివాస్, తమ్మడపల్లి రజినీ కుమార్, వద్జిరాజు దేవేందర్, ఎస్సైలు రమేష్ బాబు, తిరుపతి, బేతమల్ల చంద్రయ్య, దామరకొండ ప్రవీణ్, ఎం.డీ నజీర్, సర్పంచులు మామిడి శోభన్, బానోత్ రామన్న, ఎన్నమల్ల ప్రభాకర్, జాటోత్ అరుణ హరిచంద్, నీలం దుర్గేష్, వాలీబాల్ భిక్షం, బొబ్బిలి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
టెన్నిస్ వాలీబాల్ జూనియర్ బాలుర విభాగంలో ప్రథమ స్థానం సంగారెడ్డి, ద్వితీయ స్థానం మహబూబాబాద్, తృతీయ స్థానం హన్మకొండ జిల్లాలు కైవసం చేసుకున్నాయి. జూనియర్ బాలికల విభాగంలో ప్రథమ స్థానం సిద్ధిపేట, ద్వితీయ స్థానం హన్మకొండ, తృతీయ స్థానం మెదక్ జిల్లాలు నిలిచాయి. సబ్ జూనియర్ బాలుర విభాగంలో ప్రథమ స్థానం సంగారెడ్డి, ద్వితీయ స్థానం సిద్ధిపేట, తృతీయ స్థానం హైదరాబాద్ జిల్లాలు సొంతం చేసుకోగా, బాలికల విభాగంలో ప్రథమ స్థానం హన్మకొండ, ద్వితీయ స్థానం సిద్ధిపేట, తృతీయ స్థానం సంగారెడ్డి జిల్లాలు కైవసం చేసుకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments