డిసెంబర్ వరకూ ఉచితంగానే బియ్యం
స్పాట్ వాయిస్, బ్యూరో: పేదలకు అందిస్తున్న ఉచిత రేషన్ పథకాన్ని మరో 3నెలలు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కేంద్ర ఖజానాపై రూ.44,700 కోట్ల భారం పడనుంది. ఈ నిర్ణయం వల్ల అధిక ద్రవ్యోల్బణం నుంచి పేదలకు ఊరట కల్పించనుంది. దాంతోపాటు త్వరలో జరిగే గుజరాత్ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
80 కోట్ల మంది పేదలకు..
ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 80 కోట్ల మంది పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం లేదా గోధుమలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ పథకం సెప్టెంబరు 30న ముగియనుండడం వల్ల డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు కేంద్రం 2020 ఏప్రిల్ లోప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను ప్రారంభించింది.
మరో మూడు నెలలు రేషన్ ఫ్రీ
RELATED ARTICLES
Recent Comments