Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఆరె సంఘంతో కిషన్ రావుకు సంబంధం లేదు..

ఆరె సంఘంతో కిషన్ రావుకు సంబంధం లేదు..

స్టీరింగ్ కమిటీ నుంచి లింగంపల్లి ఔట్..
కులాన్ని సొంతానికి వాడుకుంటున్నాడు…
మళ్లీ తలదూరిస్తే న్యాయపరమైన చర్యలు..
ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ
ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం..
స్పాట్ వాయిస్, బాలసముద్రం : స్టీరింగ్ కమిటీ పదవి నుంచి ఆరె సంక్షేమ సంఘం సభ్యత్వం నుంచి లింగంపల్లి కిషన్ రావును పూర్తిస్థాయిలో తొలగిస్తున్నామని, ఇవ్వాళ్టి నుంచి లింగంపల్లి కిషన్ రావు కు, అరె సంక్షేమ సంఘానికి ఎలాంటి సంబంధం లేదని ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం బాలసముద్రంలోని వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ మాట్లాడుతూ ఆరె సంక్షేమ సంఘం స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న లింగంపల్లి కిషన్ రావు రెండేళ్ల నుంచి సంఘం నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తూ, కులానికి, సంఘానికి నష్టపర్చేలా పని చేస్తున్నాడని దుయ్యబట్టారు. పద్ధతి మార్చుకోమని సంఘం పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోకుండా ఆరె సంఘం పేరును వాడుకుంటున్నాడని, అదీ కాకుండా ఓబీసీ సాధన సమితి పేరుతో ఆరె సంఘం అనుమతి లేకుండా తనకు తానే కన్వీనర్ గా ప్రకటించుకొని కార్యక్రమాలు ప్రకటించి, కులాన్ని, కుల సభ్యులను గందరగోళానికి గురి చేస్తున్నాడని విమర్శించాడు. కిషన్ తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి ఆరె కుల సంఘ నాయకులు ఎవ్వరూ వెళ్లొద్దని సూచించారు. రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు మోర్తాల చందర్ రావు మాట్లాడుతూ ఓబీసీ రానేరాదని చెప్పిన వ్యక్తి అదే ఓబీసీ జాబితాలో చేర్చాలని ఇప్పుడు పలు సంఘాలతో కూటమి ఏర్పరుచుకొని ఆరె సంఘాన్ని అవమానపరుస్తున్నాడని కోపోద్రిక్తులయ్యారు. ఒంటెద్దు పోకడలతో కులానికి నష్టపరిచే విధంగా ప్రవర్తిస్తూ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాడని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్ప కులానికి ఏ రోజు పనిచేయలేదని దుయ్యబట్టారు. ఆరె కులాన్ని, ఆరె సంఘాన్ని ఇక నుంచి లింగంపల్లి కిషన్ రావు వాడొద్దని, వాడినట్లు తెలిస్తే కిషన్ రావుపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర సలహాదారు మారుజోడు రాంబాబు మాట్లాడుతూ లింగంపల్లి కిషన్ రావు రాజకీయ లబ్ధికోసమే సంఘాన్ని వాడుకొని అప్రతిష్టపాలు చేస్తున్నారని విమర్శించాడు. 23 కులాలకు కన్వీనర్ గా ప్రకటించుకుని ఓబీసీ సాధన సమితి అని పనిచేస్తున్నారని, ఈ విషయంపై రాష్ట్ర అధ్యక్షుడి గానీ, రాష్ట్ర కమిటీ గానీ చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడని అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భలేరావు మనో రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జెండా రాజేష్, రాష్ట్ర నాయకులు రాంనర్సయ్య, మారిజోడు నర్సింహారావు, గుండె కారి రంగారావు, రాజేశ్వరరావు, సంతోష్, సుబ్బారావు, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు హింగే శివాజీ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఇంగ్లే శివాజీ, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వీరేశం, ములుగు జిల్లా అధ్యక్షుడు ల్యాద శ్యాం, పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments