Saturday, September 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఛీ..ఛీ.. గివేం బూతులు..

ఛీ..ఛీ.. గివేం బూతులు..

వింటే చెవులు మూసుకునేడే..
ఉద్యోగులపై కార్పొరేటర్ భర్త, మాజీ కార్పొరేటర్ తిట్ల దండకం
స్పాట్ వాయిస్, వరంగల్: వామ్మో.. ఇవేం బూతులు. ఓ ప్రజాప్రతినిధి భర్త. మాజీ కార్పొరేటర్ ఇంత ఘోరంగానా మాట్లాడితే. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 38వ డివిజన్ కు చెందిన కార్పొరేటర్ ఉమ భర్త బైరబోయిన దామోదర్ యాదవ్ ఉద్యోగులపై బూతులతో చిందులు వేశారు. మున్సిపాలిటీ ఉద్యోగులపై పెత్తనం చెలాయిస్తున్నారు. అధికారులను అమ్మనా బూతులు తిట్టాడు. ఆయన మాటలు ఇప్పుడు రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అధికారులపై ఓ మాజీ కార్పొరేటర్ ఇలా చిందులు వేయడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక మదనపడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments