సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లండి..
త్వరగా పరిష్కారం అయ్యేలా చొరవ తీసుకోవాలి
మంత్రి ఎర్రబెల్లికి వీఆర్ ఏ జేఏసీ నాయకుల వినతి
స్పాట్ వాయిస్, గణపురం : సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చొరవ చూడాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు వీఆర్ ఏలు వినతి పత్రం అందజేశారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తో కలిసి బతుకమ్మ చీరలు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వీఆర్ ఏ జేఏసీ నాయకులు తమ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలని వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 63 రోజులుగా సమ్మె చేస్తున్నామని, అయినా పట్టించుకోవడం లేదని వాపోయారు. రెండేళ్ల క్రితం అసెంబ్లీ వేదిక గా సీఎం కేసీర్ ఇచ్చిన హామీలు, పే స్కేల్ అమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలని, 55 ఏళ్లు దాటిన వీఆర్ ఏలకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 మంది వీఆర్ ఏలు మనోవేదనకు గురై మరణించారని, తమ సమస్యల పై దృష్టిసారించి త్వరగా పరిష్కారం చూపాలని కోరారు. ఈ నెల 20 మంత్రి కేటీర్ రాష్ట్ర వీఆర్ ఏ ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫళీకృతం కాలేదని, హామీలు మళ్లీ హామీలు గానే మిగిలిపోయాయని వాపోయారు. మంత్రిని కలిసిన వారిలో భూపాలపల్లి జిల్లా జేఏసీ జిల్లా చైర్మన్ పకిడే రాజయ్య, గణపురం మండల జేఏసీ చైర్మన్ చెన్నూరి సమ్మయ్య, ముక్కెర కుమారస్వామి, గంధం సుమతి, పక్కల రవీందర్, చెలుమళ్ల సంపత్, రాచకొండ మురళి, బొల్లం భిక్షపతి, రమేష్, రవి, భాగ్యమ్మ, మమత, స్వప్న, జితేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
మాజీ సర్పంచ్ కు మంత్రి పరామర్శ
గణపురం మండలం చెల్పూర్ మాజీ సర్పంచ్, సీనియర్ నాయకులు బల్గూరి సుధాకర్ రావు తల్లి సుబ్బమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట స్థానిక సర్పంచ్ నడిపెల్లి మధుసూదన్ రావు, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మరావు, చెల్పూర్ సొసైటీ చైర్మన్ గండ్ర సత్యనారాయణ రెడ్డి, గణపురం పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, ఎంపీటీసీలు పొనగంటి సుధర్మ మలహలరావు, నాయకులు పిన్నింటి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
Recent Comments