Saturday, September 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్అమ్మాయి కోసం అబ్బాయిల ఫైట్

అమ్మాయి కోసం అబ్బాయిల ఫైట్

నర్సంపేట బస్టాండ్‌లో రచ్చరచ్చ
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండ్‌లో అమ్మాయి విషయంలో విద్యార్థులు శనివారం ఘర్షణ పడ్డారు. పట్టణ సమీపంలోని ఓ కళాశాల అమ్మాయి విషయంలో తలెత్తిన వివాదంతో విద్యార్థుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ క్రమంలో బస్టాండ్ సెంటర్ లోనే విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు. గత రెండు రోజులుగా విద్యార్థుల మధ్య వార్ జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments