పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్
స్పాట్ వాయిస్, వరంగల్ : వరంగల్ పద్మశాలి అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (పోపా) వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ప్ర తి ఏటా చదువుల్లో ప్రతిభ కనబర్చిన పద్మశాలి విద్యార్థులకు అందజేసే ‘పోపా పద్మశాలి ప్రతిభా పురస్కార్’ కు దరఖాస్తు చేసుకోవాలని పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్ కోరారు. ఈ ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్ ఎస్ సీ, ఇంటర్మీడియట్, నీట్, జేఈఈ, మెడికల్, ఎన్ ఐటీ, ఐఐటీ లో అ త్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారం, ప్ర శంసాపత్రం, మెమోంటో అందజేయనున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ సం దర్భంగా స్థానిక నాయకులతో కలిసి ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆయన ముఖ్య అతిధిగా హాజరై ఆవిష్కరించారు. అర్హత గల పద్మశాలి విద్యార్థులు తమ స ర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీలు, పాస్ ఫొటోను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా హన్మకొండ చౌరస్తాలోని ప్రగతి గ్రాఫిక్స్ (మాటేటి సంతోష్ కుమార్ నేత 98490 69555), వరంగల్ లోని రాధికా థియేటర్ సమీపం లోని ప్రతిభ గ్రాఫిక్స్ (మాటేటి అశోక్ కుమార్ నేత 98482 17727), పాము శ్రీనివాస్ నేత (98484 23619), ధర్మపురి రాజగోవింద్ నేత (9848708750) లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పోపా ప్రతిభా పుర స్కార్ 2022 కన్వీనర్ గోషికొండ సుధాకర్, పోపా వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుండు కామేశ్వర్, ప్రధాన కార్యదర్శి పాము శ్రీనివాస్ నేత, కోశా ధికారి భైరి శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments