Tuesday, November 26, 2024
Homeక్రైమ్చిట్ ఫండ్ మోసం...

చిట్ ఫండ్ మోసం…

సుధాత్రి చిట్ ఫండ్ చైర్మన్ అరెస్టు
రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
రూ.76 లక్షలు రావాల్సి ఉందని బాధితుడి ఫిర్యాదు..
స్పాట్ వాయిస్, క్రైమ్ : చిట్టీ గడువు ముగిసినా డబ్బులు ఇవ్వడం లేదని బాధితుడి ఫిర్యాదు మేరకు హన్మకొండ పోలీసులు కేసు నమోదు చేసి చిట్ ఫండ్ కంపెనీ చైర్మన్ ను అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించి హన్మకొండ సీఐ శ్రీనివాస్ జీ తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. పోరిక జవహర్ లాల్ అనే రిటైర్డ్ ఉద్యోగి సుధాత్రి చిట్ ఫండ్ కంపెనీ హనుమకొండ బ్రాంచిలో చిట్టి వేశాడు. చిట్టి గడువు ముగిసినా సుధాత్రి చిట్ ఫండ్ కంపెనీ ఆయనకు డబ్బులు ఇవ్వలేదు. జవహర్ లాల్ కు డిపాజిట్ చేసిన రూ.19,75,500 తో పాటు చిట్ ఫండ్ కంపెనీ నుంచి రావాల్సిన రూ.56,36,400 మొత్తంగా కలుపుకుని రూ.76,11,900 రావాల్సిన ఉన్నా సుధాత్రి చిట్ ఫండ్ కంపెనీ ముఖం చాటేస్తోంది. తనకు రావాల్సిన డబ్బుల విషయమై పలుమార్లు జవహర్ లాల్ కోరినా పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితుడు చిట్ ఫండ్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సుధాత్రి చిట్ ఫండ్ కంపెనీ చైర్మన్ వ్యామసాని రవీందర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు హనుమకొండ పోలీస్ ఇన్ స్పెక్టర్ సీహెచ్ శ్రీనివాస్ జీ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments