Wednesday, March 12, 2025
Homeజిల్లా వార్తలుద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి

పరకాల రూరల్ సీఐ శ్రీనివాస్ రావు
ల్యాదెళ్ల లో పోలీసుల కళాజాత
స్పాట్ వాయిస్ , దామెర : మండలంలోని ల్యాదెళ్ల గ్రామంలో బుధవారం రాత్రి పోలీసు కళాజాత బృందం ఆధ్వర్యంలో కళా ప్రదర్శన నిర్వహించారు. ఇందులో భాగంగా వారు డయల్ 100, సైబర్ నేరాలు, ఆన్ లైన్ మోసాలు, ట్రాఫిక్ నిబంధనలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెల్మెట్ వాడకంపై పాటలు, నాటికలు, డ్యాన్స్ లతో అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పరకాల రూరల్ సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని, విధిగా హెల్మెట్ ను ధరించాలని సూచించారు.

ఎస్సై హరిప్రియ మాట్లాడుతూ.. ఇంట్లోని కుటుంబ సభ్యులను చూసి వారికోసమైనా, హెల్మెట్ ను ధరించి వెళ్లాలని సూచించారు.బ్యాంక్ అకౌంట్ వివరాలను ఎవరికి చెప్పకూడదని, ఎవరైనా అడిగితే వెంటనే డయల్ 100 కానీ, దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై హరిప్రియ, సర్పంచ్ శ్రావణ్య, గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments