Saturday, April 5, 2025
Homeకెరీర్దసరా సెలవులు తగ్గించేదేలే..

దసరా సెలవులు తగ్గించేదేలే..

26 నుంచి అక్టోబర్ 9 వరకు  హాలీడేస్
విద్యాశాఖ ప్రకటన
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: దసరా సెలవులపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. సెలవులు తగ్గించాలన్న రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రతిపాదనను తిరస్కరించింది. సెలవుల్లో ఎలాంటి మార్పు లేదని.. ఈనెల 26 నుంచి అక్టోబర్ 9 వరకు యథాతథంగా పాఠశాలలకు సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది. తిరిగి అక్టోబర్ 10న పాఠశాలలు ప్రారంభమవుతాయంటూ ప్రకటన జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా జూలైలో పాఠశాలలకు సెలవులు ఇచ్చినందున.. నష్టపోయిన బోధన పనిదినాల భర్తీకి దసరా సెలవులు తగ్గించాలని పాఠశాల విద్యాశాఖకు ఎస్‌సీఈఆర్‌టీ సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఆ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ తొలుత ప్రకటించిన విధంగానే దసరా సెలవులు కొనసాగుతాయని వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments